28.7 C
Hyderabad
April 28, 2024 10: 05 AM
Slider కడప

జగన్ రెడ్డి పాలనలో దిగజారిన పాఠశాల విద్య

#tulasireddy

రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దిగజారిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. జగన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమం గురితప్పిందని ఆయన అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు వెలవెల.. ప్రైవేట్ పాఠశాలలు కళకళ చందంగా మారిందని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గింది. 2021-22 లో విద్యార్ధుల సంఖ్య 45.71లక్షలు కాగా 2022-23 లో 41.24 లక్షలు. అంటే 4.47 లక్షలు తగ్గింది అని తులసిరెడ్డి అన్నారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2021-22 లో 24 లక్షల మంది ఉండగా 2022-23 లో 29.10 లక్షల మంది. అంటే 5.10 లక్షలు పెరిగింది అని ఆయన అన్నారు.

3,4,5 తరగతులను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల నుండి విడగొట్టి ప్రభుత్వ హై స్కూల్ లలో విలీనం చేయడం దీనికి ప్రధాన కారణం అని ఆయన తెలిపారు. దీని వలన అమ్మఒడి, విద్యా కానుక, నాడు-నేడు నిష్ప్రయోజనం అయ్యాయని తులసిరెడ్డి అన్నారు.

Related posts

ఎలక్షన్ స్పీచ్:తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి

Satyam NEWS

పోలీసు జాగిలాలు రాఖీ, డైనా, వీనలు పసిగట్టడంలో భేష్ అంట..!

Satyam NEWS

“తెలంగాణ బత్తాయి డే” బ్రోచర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment