Slider కరీంనగర్

మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది

eetala 17

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అందుకే రాష్ట్రంలో దాదాపు 750 మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పాఠశాలల్లో మంచి విద్య, మంచి ఆహారం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి రెండవ స్పోర్ట్స్ మీట్ ను ఆయన మానకొండూర్ మండలం పోచంపల్లి(రంగపేట) మోడల్ స్కూల్ లో నేడు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ తో బాటు ఎమ్మెల్సీలు కూర రఘోత్త౦ రెడ్డి, నారదాసు నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో కేవలం చదువులే కాకుండా ఆటల్లోనూ రాణించేలా మోడల్ స్కూల్ ప్రోత్సాహిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

ప్రైవేట్ పాఠశాల్లో కనీసం గ్రౌండ్ లు కూడా లేకుండా కేవలం చదువే లక్షయంగా పనిచేస్తున్నాయని అది మంచిది కాదని మంత్రి తెలిపారు. హంస ఎలాగైతే పాలను నీళ్లను ఎలా వేరు చేస్తుందో ఆలాగే విద్యార్థులు మంచిని చెడును ఎరిగి మంచిని స్వీకరించాలని అన్నారు. నాణేనికి బొమ్మ బొరుసు లాగా గెలుపోటములు సహజమని మంత్రి క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు.

Related posts

మూడు రాజధానులకు మద్దతుగానే ఈ మునిసిపల్ తీర్పు

Satyam NEWS

ఖాకీల అదుపు లో గంజాయి స్మగ్లర్లు…!

Satyam NEWS

ఇంతకాలం దోచుకుతిన్న వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!