40.2 C
Hyderabad
April 26, 2024 14: 59 PM
Slider నిజామాబాద్

ఎల్లారెడ్డి ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

yellareddy science day

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన సైన్స్ ప్రదర్శనశాలలో విద్యార్థులు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటేశం మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ఘనత సీవీ రామన్ దేనని,  ఫిబ్రవరి 28 న జాతీయ సైన్సు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని తెలిపారు.

ఈ ప్రదర్శన వల్ల విద్యార్థులలో శాస్త్రీయ భావనలు పెంపొందించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని, గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లో మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలు వంటివి నమ్మకుండా ప్రతిదీ కూడా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. విద్యార్థులు పలు స్టాళ్లలో తయారుచేసిన ప్రయోగాలను అభినందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

Satyam NEWS

తిరుమల శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేయడం కుదరదు

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంత విద్యార్ధులకు పుస్తకాలు పంచిన చింతలపల్లి

Satyam NEWS

Leave a Comment