26.7 C
Hyderabad
April 27, 2024 09: 12 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా విశేష సాంస్కృతిక కార్యక్రమాలు

#phanigirigutta

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల మూడో రోజు గట్టు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ప్రాతఃకాలార్చన,తిరుప్పావై సేవాకాలం అర్చకులు వైభవంగా జరిపారు. దేవాలయంలోని చక్ర పేరుమాళ్లను పల్లకిలో వేంచేయింప చేసి పట్టణం లోని దేవాలయానికి తీసుకొని వచ్చి ప్రదక్షిణ గావించి ప్రసాదం సమర్పించి,మరల అర్చక స్వాములు గట్టుపైకి తీసుకువచ్చారు.అనంతరం నీరాజనం, మంత్రపుష్పం,తీర్థప్రసాద వినియోగం చేశారు.

భక్తులు విశేషంగా స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక శాసనసభ్యుడు శానంపూడి   సైదిరెడ్డి ధర్మపత్ని రజిత,ఆర్డిఓ వెంకారెడ్డి,తహసీల్దార్ జయశ్రీ, మున్సిపల్ కమీషనర్,ప్రభుత్వ అధికారులు,స్థానిక నాయకులు స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

కల్యాణోత్సవం సందర్భంగా గట్టుపై గల వేదికపై సప్తస్వర భజన మండలి, గీతా గోవిందం భజన మండలి వారు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను విశేషంగా అలరించాయి.రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణం గురించి ప్రదర్శించిన నాటిక భక్తులను ఆకట్టుకుంది.యువతీ యువకులు ప్రదర్శించిన డాన్స్ బేబీ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,స్థానాచార్యులు శ్రీనివాసాచార్యులు,అర్చకులు నరగిరినాధుని నరసింహాచార్యులు, రంగభట్టాచార్యులు,భాస్కరా చార్యులు, రామకృష్ణమాచార్యులు,మురళీ కృష్ణమా చార్యులు,ధర్మ కర్తల మండలి సభ్యులు రామిశెట్టి రాము, గురవయ్య,వెన్న పద్మ,కోలపాటి వెంకటేశ్వర్లు,లక్క వెంకన్న, నరసింహమూర్తి కళాకారులు కంబాల శ్రీనివాస్,జోన్నలగడ్డ గోవింద్,దోంతగాని సత్యనారాయణ,అన్నేం నాగేందర్,విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రెచ్చిపోయిన కామాంధులు: మైనర్లపైనే తీర్చుకున్న కామవాంఛలు

Satyam NEWS

అధికారం ఉంటే ఏదైనా చేస్తారా..?

Satyam NEWS

విజయనగరం కలెక్ట్రెట్ లో సా దా సీదా గా అమరజీవి వర్ధంతి…!

Satyam NEWS

Leave a Comment