30.7 C
Hyderabad
April 29, 2024 05: 43 AM
Slider ఆధ్యాత్మికం

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో ఈనెల 10న‌ సీతారాముల క‌ల్యాణం..!

#vysanarayanamettu

గ‌త చ‌రిత్ర‌కు స‌జీవ సాక్ష్యం….విజ‌య‌న‌గ‌రం. ఈ ఆధునిక కాలపు అందులోనూఈ స్పీడ్ యుగానికి తెలిసింది కొంతే. కానీ  ఈ విజ‌య‌న‌న‌గ‌రం  1500 క్రితంకు పూర్వ‌మే ఉండేడిద అని అందుకు సాక్ష్య‌మే అతి పురాత‌న వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌, బొడి కొండ‌, అదే రామ‌తీర్ధం..కుమిలి కొండ‌లు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ..ఎన్నోన్నో. వ‌ర్త‌మానానికి వ‌స్తే…ఈ క‌లియుగం అంత‌కుముందు త్రేతాయుగం..దానికి ముందు ద్వాప‌ర‌యుగం…ఆ ద్వాప‌ర యుగం సంద‌ర్బంలో  స్థ‌ల పురాణం స్థానిక ఆధారాల ప్ర‌కారం..వేద గురువు వ్యాస‌భ‌గ‌వానులు త‌ప‌స్సు  చేసిన విజ‌య‌న‌గ‌రం పూల్ భాగ్ స‌మీపంలోని  వ్యాప‌నారాయ‌ణ మెట్టలో  శ్రీరామ‌నవ‌మి ఉత్స‌వం నిర్వహించేందుకు స్పార్క్ సోసైటీ స‌న్న‌ద్దం అవుతోంది.

ఆ మెట్ట‌పై  అదే కొండ‌పై శ్రీరాములు న‌డియాడిన పాద ముద్ర‌ల‌ను త‌వ్వ‌కాల‌లో క‌నుక్కొంది….స్పార్క్ సొసైటీ. గ‌డ‌చిన రెండేళ్ల నుంచీ  వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌ను..సామాన్య మాన‌వులు భ‌క్తులకు తెలియ చెప్పే విధంగా  మెట్ట‌కు ఓ ఆకారాన్ని తీసుకువ‌చ్చిన స్పార్క్ సొసైటీ తాజాగా ఈనెల 10న ఆది వారం శ్రీరామ‌న‌వమి  ఉత్స‌వాన్ని వైభ‌వంగా నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్దం అవుతోంది. అలాగే మెట్ట పైభాగంలో శ్రీరాముని పాద‌ముద్ర‌లు ఉన్నచోట భ‌క్తుల సౌక‌ర్యార్ధం మెట్ల మార్గాన్ని కూడా క‌ల్పించింది..స్పార్క్ సొసైటీ.

ఈ న‌వమి రోజున వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌పై శ్రీ సీతారాముల కల్యాణం కోసం…ఓ ఆనంద వేదిక‌ను కూడా సిద్దం  చేస్తోంది..స్వ‌చ్చంద సంస్థ‌..స్పార్క్ సొసైటీ. శ్రీ వ్యాస నారాయణ స్వామి వారి దేవస్థానం, ఫూల్ బాగ్ కాలనీలో జరుగు శ్రీ రామ నవమి సంద‌ర్బంగా జ‌ర‌గ‌బోవు    అన్నదానం లో పాల్గొనే దంపతులకు స్వ‌యంగా సంస్థే… స్వర్ణ పుష్పం,ముత్యాల తలంబ్రాలు ఇచ్చేందుకు .పేర్లు నమోదు చేసుకోవాల‌ని కోరుతూ… 9347522850 నెంబర్ కు కాల్ చేయాల‌ని నిర్వాహ‌కులు సోసైటీ అధ్య‌క్షుడు  భవానీ పద్మనాభం, కోరుతున్నారు.  అలాగే న‌వ‌మి రోజున ఎవ్వ‌రైనా భ‌క్తి గీతాలు పాడాల‌నుకునే వారికి ఈ నెల 10 న వ్యాసనారాయ‌ణ మెట్ట‌లో ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు. భ‌క్తి గీతాలు పాడిన‌వారికి స్వామి వారి ముత్యాల తలంబ్రాలు,స్వ‌ర్ణ పుష్పం కానుక‌గా ఇస్తామన్నారు.

Related posts

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యo

Murali Krishna

నేరాల నియంత్రణ లో యువత భాగస్వామ్యం కీలకం

Satyam NEWS

ప్రొటెస్టు డే: రేవంత్ అరెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS

Leave a Comment