26.7 C
Hyderabad
April 27, 2024 10: 41 AM
Slider ప్రపంచం

రష్యా కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు వెల్లువ

#RusiaVaccine

రష్యా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబికిన అనుమానాలను ఆ దేశం కొట్టిపారేస్తున్నది. తాము రూపొందించిన వ్యాక్సిన్ సురక్షితమైనదని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖయిల్ మురాస్కో వెల్లడించారు. ప్రపంచ దేశాల నిపుణులు వెలిబుచ్చుతున్న అనుమానాలు నిరాధారమైనవని ఆయన అన్నారు.

ఇంకా మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే వ్యాక్సిన్ పై సమాచారాన్ని వెల్లడించడం దేశానికి చెడ్డపేరు తీసుకువస్తుందని కొందరు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

వ్యాక్సిన్ అభివృద్ధి పరచిన గమలేయ ఇన్ స్టిట్యూట్ తమ పరిశోధనా ఫలితాలను తమ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మెడికల్ జర్నల్స్ కు పంపుతామని అంటున్నారు.

వాక్సిన్ ను తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లకు, టీచర్లకు తొలి బ్యాచ్ లో ఇస్తామని గమలేయ ఇన్ స్టిట్యూట్ తెలిపింది. రాబోయే రెండు వారాల్లో తొలి బ్యాచ్ వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని వారు వెల్లడించారు.

 డిసెంబర్ నాటికి ఐదు లక్షల డోసులను ఉత్పత్తి చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకున్నది. తమ సహచర దేశం అభివృద్ధి పరచిన వ్యాక్సిన్ ను పరీక్షించేందుకు కజకిస్తాన్ శాస్త్రవేత్తులు వెళుతున్నారు.

Related posts

ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్ల బోతున్న జీహెచ్ఎంసి?

Sub Editor

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS

మాన్ సూన్ షవర్స్: రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Satyam NEWS

Leave a Comment