21.7 C
Hyderabad
December 2, 2023 04: 08 AM
Slider సినిమా

శివ కంఠమనేని ఫ్యామిలీ సెంటిమెంటు థ్రిల్లర్

Light-House-Cine-Magic

మంచి కథ ఉంటేనే నటించడానికి అంగీకరించే శివ కంఠమనేని మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘అక్కడొకడుంటాడు’ చిత్రంతో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మరో కొత్త చిత్రానికి ఆయన అంగీకరించారు. శివ కంఠమనేని ప్రధాన పాత్రలో లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మించనున్న ఈ చిత్రం శనివారంనాడు రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది. సీనియర్ దర్శకుడు సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్‌ ఇతర ప్రధాన తారాగణం. ఈ సందర్భంగా చిత్రం నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ సెంటిమెంటుతో కలిసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ శనివారం పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రాన్ని ప్రారంభిస్తాం. అదే రోజున రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. రెండు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. నాలుగు పాటల రికార్డింగ్‌ పూర్తయింది. వీటిలో మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్‌రో… అయ్యిందేమో డాక్టరో’ పాటను ‘గీత గోవిందం’లో ‘కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయింది’ రాసిన సాగర్‌ రాశారు. సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు’’ అన్నారు. శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్‌, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ‘బిత్తిరి సత్తి, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Related posts

కడప జిల్లాలో పోలీసుల వేధింపు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

మానవ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్

Satyam NEWS

రాజ్యాధికారమే మాదిగ జన చైతన్య లక్ష్యం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!