తల్లి అంటే అతనికి ప్రాణం. ఆమె గుండెపోటుతో కళ్లెదుటే ప్రాణాలు వదలడం చూసి తట్టుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఆమె వద్దనే అతనూ తనువు చాలించాడు. కడియపులంక పరిధిలోని బుర్రిలంక శ్రీవెంకట శ్రీనివాసా నర్సరీ అధినేత పాటంశెట్టి వెంకట్రాయుడు(ఎర్రపెద్ద) భార్య సత్యవతి (55) శుక్రవారం అర్ధరాత్రి గుండెలో నొప్పి మొదలైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారులో రాజమండ్రి బయలుదేరారు. ఆమె వెంట పెద్దకుమారుడు పాటంశెట్టి శ్రీనివాసరావు (40) గుండెపోటు తీవ్రం కావడంతో వేమగిరి వచ్చేసరికి సత్యవతి మృతిచెందింది. అది చూసిన శ్రీనివాసరావు తల్లి కోసం విలపిస్తూ కారులోనే ఆమె మీద పడి మృతిచెందాడు. కాగా శ్రీనివాసరావుకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లీకొడుకులు ఒకేసారి మృతి చెందడం ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం అలుముకుంది.
previous post