38.2 C
Hyderabad
April 29, 2024 13: 00 PM
Slider ప్రకాశం

కార్తీక పౌర్ణ‌మి ప్ర‌త్యేక పూజ‌లు

Shidda Raghva rao

కార్తీక పూర్ణమి సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రంలోమాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధాకర్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి విశేష పూజలు, లక్ష దీపాలు వెలిగించి శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం కార్తీక పౌర్ణమి నాడు హరిహర క్షేత్రంలో ఆనవాయితీగా జరిగే కార్యక్రమం జ్వాల తోరణం అత్యంత వైభవంగా జరిగింది. జ్వాల తోరణం దర్శనం సర్వ పాప హారణం.. మానవులు తాము చేసిన పాపాలు అన్ని హరించి వేయమని దేవ దేవుణ్ణి వేడుకుంటూ జ్వాలా తోరణం క్రింద నడిచి తమ పాపాలు తొలగించమని ప్రార్ధించే ఆచారమే జ్వాలా తోరణ కార్యక్రమ పరామార్థం. ఏటా కార్తీక పౌర్ణమి నాడు హరిహర క్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమం భక్తులను అలరిస్తుంది.

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు సంప్రదాయ రీతిలో పరమేశ్వరుని పూజలు చేసి జ్వాల తోరణం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం పార్వతి సమేత నగరేశ్వర స్వామి వారికి, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శివ నామ స్మరణతో హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. హరిహర క్షేత్రంలో దీపాల వెలుగులతో సాక్ష్యత్తు కైలాసాన్ని తలపించింది. నగరేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు దైవిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శిద్దా వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

Related posts

ఈ ఫొటోలోని పాప బాగుందా? కానీ ఆ దుర్మార్గురాలికి….

Satyam NEWS

సిఎం జగన్ పర్యటన రద్దు పోలింగ్ శాతంపై ప్రభావం?

Satyam NEWS

22 వ తేదీన‌ బొడికొండ రామ‌తీర్దం ఆల‌య పున‌: ప్రారంభం

Satyam NEWS

Leave a Comment