32.7 C
Hyderabad
April 26, 2024 23: 19 PM
Slider విజయనగరం

పవన్ కళ్యాణ్ కు “ప్రత్యేక భద్రతను” ఏర్పాటు చేయాలి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటివద్ద అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు ఉండటాన్ని నిరసిస్తూ.., పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన భద్రతను కల్పించాలని కోరుతూ విజయనగరం కలక్ట్రేట్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్, పొట్నురు చందు, కందివలస సురేష్, కనిసెట్టి రామకృష్ణ, రోయ్య రాజు, ఎంటి రాజేష్,పవన్, బత్తుల చందు, జీవ,పార్టీ నేతలు లాలిశెట్టి రవితేజలు నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ప్రజల్లో జనసేన, పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకే జగన్ ప్రభత్వం ఇటువంటి నీచమైన, దిగజారుడు రాజకీయాలకు తెరలేపిందని, కుక్కకు సింహాసంపై కూర్చుండపెట్టినట్లు,భయంకరమైన క్రిమినల్ కు అధికారం కట్టబెడితే సీఎం జగన్ బుద్ది చూపిస్తున్నాడని, ఇటువంటి నేరపూరిత వ్యక్తులను శిక్షలు అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయటం వలన నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. నవసమాజాన్ని స్థాపించడం కోసం పవన్ కళ్యాణ్ ఆవిర్భించారని ఇటువంటి నాయకుడుపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తే రాష్ట్ర అల్లకల్లోలం అవుతుందని హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు.

మరో నేత త్యాడ రామకృష్ణారావు(బాలు)మాట్లాడుతూ రాష్ట్రంలో ఐతే రెడ్లరాజ్యం లేదా ఖమ్మరాజ్యం ఉండాలనే ఉద్దేశంతో బిసి నాయకులను అణగదొక్కాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, నవతరాన్ని సృష్టించ డానికి వచ్చిన మహనేత పవన్ కళ్యాణ్ ను తాకాలంటే జాయితీగా పవన్ కళ్యాణ్ ఆశాయాలకోసం ఉండే మా జనసైనుకులను దాటి వెళ్లాలని హెచ్చరించారు.

ఈ నిరసన దీక్షా శిబిరానికి మద్దతుగా ఉత్తరాంధ్ర వీర మహిళ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, గంట్లాన పుష్పకుమారి, రాష్ట్ర గిరిజన నాయకులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దోర, పార్టీ నాయకులు రౌతు సతీష్ కుమార్, గజతినగరం నియోజక వర్గం నాయకులు మర్రాపు సురేష్, చీపురుపల్లి నియోజకవర్గం నాయకులు జమ్ము ఆదినారాయణ, సీనియర్ నాయకులు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షుడు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, మిడతాన రవికుమార్, ఎర్నాగుల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

Satyam NEWS

సీఎం జగన్ 50వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

Satyam NEWS

పామరుల భాషలో పద్యాలు రచించి మహాకవి యోగి వేమన..!

Bhavani

Leave a Comment