42.2 C
Hyderabad
April 26, 2024 15: 41 PM
Slider ప్రత్యేకం

వాళ్లు పోలీసులు కాదు…ఖాకీ దుస్తులు వేసుకున్న దేవుళ్లు…!

#VijayanagaramSP

(ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్, విజయనగరం)

పోలీసుల‌లో కాఠిన్యం పోయి..క‌రుణ క‌నిపిస్తోంది..కాదు కాదు.. క‌ర‌కుద‌నం బ‌దులు కారుణ్య ర‌సం తొణికిస‌లాడుతోంది. లాఠీ,గ‌న్ ప‌ట్టాల్సిన ఆ ఖాకీ చేతులే ఆప‌ద‌లో ఉన్న వాళ్ల‌ను అక్కున చేర్చుకుంటున్నారు. ఖాకీ డ్రెస్ లు వేసుకున్న వాళ్లే దేవుళ్లై  కొన్ని ప్రాణాల‌ను నిల‌బెడుతున్నారు.

తాజాగా ఆ కోవ‌లోకి మ‌రోసారి విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసులు చేరి మ‌రోసారి మీడియా లోకి వ‌చ్చారు. జాలి, ద‌య‌, మాన‌వ‌త్విం అన్న ప‌దాల‌ను వంట ప‌ట్టించుకుని..శ‌భాష్  పోలీస్ అని ప్ర‌జ‌ల‌చేత అనిపించుకుంటున్నారు. క‌రోనా  కాలంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఎస్పీ రాజ‌కుమారీ…పోలీస్ శాఖ లో ఓ స్పూర్తినే నింపార‌ని చెప్పాలి.

మొన్నామధ్య వర్ష‌కాలంలో  కొత్త పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో రోడ్డు వ‌ర్ష‌పు నీరుకు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గురైతే దానిపై వెళుతున్న వాహ‌నదారుల‌కు,పాదాచారుల బాధ‌ల‌ను క‌ళ్లారా చూసిన స్టేష‌న్ కానిస్టేబుల్ సురేష్ మాన‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించి త‌న ఖ‌ర్చుల‌తో ఆ రోడ్డు బాగు చేయించారు.

అదే కానిస్టేబుల్…100కు వ‌చ్చిన ఫోన్ కాల్  తో స‌కాలంలో సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి….చావు అంచుల‌కు వెళ్ల‌బోయిన ఓ వ్య‌క్తి ప్రాణాలు కాపాడి శ‌భాష్ పోలీస్ అని శాఖ‌ను మెప్పించేలా వ్య‌వ‌హ‌రించారు.జిల్లా కొత్తవలసలో ఆత్మహత్యా యత్నానికి యత్నించిన గణపతి అనే వ్యక్తి కి సపర్యలు చేసి, ఆసుపత్రిలో చేర్పించి… చికిత్స అందించారు.

అంత‌టితో త‌న బాధ్య‌త‌ను విస్మ‌రించ‌లేదా..కానిస్టేబుల్. బాధితుని చేతికి 11 కుట్లు వేయించి… అనంత‌రం..ఆ వ్యక్తిని వారి బంధువులకు అప్పగించి, మానవత్వం చాటుకున్నారు.

పోలీస్ అంటే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌ట‌మే కాకుండా…..క్ష‌ణికావేశాల‌కు గురై…..నిండు జీవితాన్నికాల‌రాసుకోవ‌డానికి కాద‌ని…ఎంతో కొంత ఏదో విధంగా స‌మాజానికి ఉప‌యోగ ప‌డాల‌నే…జిల్లా పోలీస్ అధికారి సూచ‌న‌ల‌తో పోలీస్ సిబ్బంది అంతా  ముంద‌డుగు వేస్తున్నారు..హేట్సాఫ్ పోలీసోడా…!

Related posts

మోపిదేవి లో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం

Satyam NEWS

కామారెడ్డిలో బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా

Bhavani

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

Leave a Comment