35.2 C
Hyderabad
April 27, 2024 11: 23 AM
Slider ముఖ్యంశాలు

దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

198891-scr-north

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు: సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు (నెంబర్‌: 82725) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 10వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌నెం:07256) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 12, 13వ తేదీల్లో రాత్రి 7.25గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు(నెంబర్‌:82731) సికింద్రాబాద్‌ నుంచి జనవరి 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.

నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌:07255) నర్సాపూర్‌ నుంచి జనవరి 18వ తేదీ సాయంత్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ సువిధ స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 82727 (నర్సాపూర్‌ నుంచి జనవరి 19వ తేదీ రాత్రి 8గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.50గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

Related posts

డివైన్ స్పెషల్: జమ్మిచెట్టుకు ప్రదక్షిణ గోమాతకు పూజ

Satyam NEWS

హ్యాపీ ఎండింగ్: హైదరాబాద్ చేరుకున్న ఇరాక్ వలస కార్మికులు

Satyam NEWS

హిందూ మతంపై ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యయన కేంద్రం

Bhavani

Leave a Comment