30.7 C
Hyderabad
April 29, 2024 04: 53 AM
Slider కరీంనగర్

ఇసుక దోపిడీ పై ఇక ప్రజాఉద్యమం తప్పదు

#KatakamMrutunjayam

స్థానికుల అవసరాలకు ఇసుక ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారని దీనిపై ప్రజా ఉద్యమం తప్పదనీ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు కటకం మృత్యుంజయం హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృత్యుంజయం మాట్లాడుతూ ఇసుకను దొంగతనంగా తీసుకువెళ్తే పట్టుకోండి స్మగ్లింగ్ చేస్తే పట్టుకొని జైల్లో పట్టండి కానీ  సొంత అవసరాలకు ఇసుకను  ఇవ్వకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని అన్నారు.

ఈ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమం చేస్తామని ఆయన  హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఇటీవల ప్రకటించిన రౌడీ షీటర్ లను  బహిరంగ పరచాలని ఆయన కోరారు.

అయ్యా మహాప్రభో  రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్  సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా మందిని అరెస్టు చేస్తే మీకే అవమానకరం. మాకు జరిగేది ఏమీ లేదు అని ఆయన అన్నారు.  కేటీఆర్  మీకు  ప్రజల పై విశ్వాసం ఉంటే సమాజం పై విశ్వాసం ఉంటే ఉద్యమాల పై విశ్వాసం ఉంటే   మీరు సిరిసిల్ల కు  వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేయడం మానుకోవాలని మృత్యుంజయం హితవు పలికారు. 

ఈ సందర్భంగా సిరిసిల్ల మానేరు వాగులో  ఉన్న ఇసుక రీచ్ ను బిజెపి పార్టీ నాయకులు కటుకం మృత్యుంజయం తో పాటు బిజెపి అనుబంధ సంఘాల నాయకులు వెళ్ళి పరీశీలించారు. 

ఈ కార్యక్రమంలో  బిజెపి పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి  మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్   సీనియర్ బిజెపి నాయకులు ఆవునూరి రమాకాంతరావు అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి  శీలం రాజు కౌన్సిలర్లు  నాగరాజ్ గౌడ్  భాస్కర్  కీర్తి కమలాకర్ రావు ఎంపిటిసి  బైరగోని రాం నాయకులు  ఆశోక్  రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రాజీనామా చేస్తారా ?

Satyam NEWS

తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు

Satyam NEWS

9 మంది విజయనగరం పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment