ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేకపోతే దారుణ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారులు సస్పెండ్ అయిన విషయం ప్రస్తావిస్తూ ఎన్నికల లో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రధారులను బిజెపి మాత్రం వదలదని ఆమె అన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా ఆధారాలు తో సహా ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లు వ్యవహారం పై ఫిర్యాదు చేశామని దాంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. నకిలీ ఎపిక్ కార్డు లు పై సమాచారం బిజెపి దృష్టి కి రావాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లు తో గట్టెక్కాలని చూస్తోంది.తక్కవ మార్జిన్ తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్ర కు నాంది పలుకుతుందని అనుమానం వారి మాటలు బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకి తెలియచేసాం. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి వారితో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించాం. అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది ఒక గొప్ప కార్యక్రమం కి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ అని ఆమె అన్నారు.