37.2 C
Hyderabad
April 30, 2024 12: 06 PM
Slider ముఖ్యంశాలు

ఆద్యంతం టీడీపీ అధినేత బాబు పైనే విమర్శలు…!

#yvsubbareddy

విజయనగరం లో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం…

వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం…. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తొలిసారిగా విజయనగరం వచ్చారు… అదీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశేషం ఏంటంటే… ఒక్క టీటీడీ చైర్మన్ మినహా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు అంతా… చివరకు డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్… ఆఖరికి మంత్రి కూడా టీడీపీ అధినేత పైనే బాణాలు సంధించారు.

2014లో సీఎం అయిన చంద్రబాబు..రాష్ఠ్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచాడో ప్రజలు చూసే…2019లో జగన్ కు అత్యధిక స్థానాలు ఇచ్చే గడచిన ఈ మూడున్నరేళ్లో…సామాన్యుడు సహితం అభివృద్ధి ఫలాలు అందేలా పాలన సాగించారన్నారు.డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అయితే… చంద్రబాబు ఓ 420 అని…మంత్రి బొత్స అయితే… చంద్రబాబు అసలు జ్ఞానం లేదని.. డిప్యూటీ సీఎం రాజన్న దొర అయితే… జగన్ కాలిగోటికి చంద్రబాబు పనికి రారని విమర్శలు సంధించారు.

ఈ మేరకు విజయనగరం పూల్ భాగ్ జే కన్వెన్షన్ లో 11వ తేదీన జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షత న…వైఎస్సార్సీపీ ఉమ్మడి విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యే లు హాజరయ్యారు. ఒక్క నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తప్ప.చివరకు ప్రతి పక్ష పార్టీ పై అస్సలు విమర్శలు సంధించని మంత్రి బొత్స సత్యనారాయణ…ఈ సమావేశంలో చంద్రబాబు నుద్దేశించి వాక్బాణాలు సంధించడం విశేషం.

2024 లో మళ్ళీ జగన్ నే సీఎం గి పార్టీ కూర్చో పెట్టించాలని అందుకు ప్రతీ ఒక్క కార్యకర్త సంసిద్దుడై ఉండాలన్నారు. అలాగే కార్యకర్తలే పార్టీ కి బలం ,పునాదని..డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అనగా…చంద్రబాబు కు అసలు మతి ఉందా అని మంత్రి బొత్స మాట్లాడారు. రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… సచివాలయాల కార్యదర్శులే క్రియాశీలకంగా వ్యవహరించాలని…ఈ నెల 20 లోపు మళ్ళీ సమావేశం అవ్వాలన్నారు.

Related posts

తునిలో మంత్రి ధర్మాన మునిసిపల్ ఎన్నికల ప్రచారం

Satyam NEWS

రైతును రాజును చేసేందుకే ఈ రైతు వేదికల ఏర్పాటు

Satyam NEWS

అధికార పార్టీలోకి మారి రెండేళ్లు….అభివృద్ధి మాత్రం శూన్యం…

Satyam NEWS

Leave a Comment