ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జేఏసీ ఉద్యమానికి మద్దతుగా టీడీపీకి రాజీనామా చేసి పోరాటానికి సిద్దమవుతున్న సందర్భంగా సుబాన్ బాషా తన కార్యాలయంలో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులతో చర్చించారు. చర్చల్లో భాగంగా ఎన్ ఆర్సీ కి పార్లమెంట్లో ఓటు వేయని ఎంపీ కేశినేని నాని ని పిలిపించి జేఏసీ ఉద్యమం లో ప్రసంగించాలని తీర్మానం చేశారు. టీడీపీ కి రాజీనామా చేసేందుకు తాము సిద్ధమేనని,అలాగే జేఏసీ నేతలు రాష్ట్రంలో ని అన్ని రాజకీయ పార్టీల మైనార్టీ నేతలు రాజీనామా చేయించి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు చర్యలు తీసుకోవాలనే తీర్మానం చేశారు.
ఈ తీర్మాన అంశాలు జేఏసీ నేతలకు తెలిపి బిల్లు వెనక్కి తీసుకొనేలా, కనీసం అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చర్చలో టీడీపీ నాయకులు అక్బర్, అబిడ్ అలీఖాన్, బాలదాసు, సుబ్బయ్య, అమీర్ బాషా, ఉస్మాన్ ఖాన్, రఫీద్దీన్, షబ్బీర్,తదితరులు పాల్గొన్నారు.