31.2 C
Hyderabad
May 2, 2024 23: 13 PM
Slider జాతీయం

భారత్ లో ఎక్కువగా ఉన్న హైబ్రీడ్ రోగ నిరోధక శక్తి

#corona

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే రాబోయే రోజుల్లో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కానీ, విదేశీ విమానాలను నిలిపివేయాల్సిన అవసరం కానీ ఉండదని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం తాజా కరోనా కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్‌కు సూచనలు ఇచ్చింది. దేశంలో కరోనా పరీక్షలను కూడా పెంచారు.

కోవిడ్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు నిరంతరం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ గులేరియా మాట్లాడుతూ, భారతీయ ప్రజలలో ‘హైబ్రిడ్ రోగనిరోధక శక్తి’ కనిపిస్తోందని, కాబట్టి ఇక్కడ ఇన్‌ఫెక్షన్ పెరిగినప్పటికీ, తీవ్రమైన కేసులు లేదా రోగులను ఆసుపత్రులలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు.

అయితే, ప్రజలందరూ నిరంతరం నివారణ చర్యలను అనుసరించాలని ఆయన కోరారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మరొక వేవ్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా టీకా ఎక్కువ మంది సరైన డోసులో తీసుకోవడం వల్ల, అదే విధంగా సహజంగా ఎక్కువగా ఉన్న ఇమ్యూనిటీ కారణంగా భారతీయ జనాభా ఇప్పటికే హైబ్రిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, కాబట్టి ప్రజలు భయపడకూడదు అని ఆయన తెలిపారు.

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని పల్మనరీ విభాగం, క్రిటికల్ కేర్ డాక్టర్ నీరజ్ గుప్తా ఈ అంశంపై మాట్లాడుతూ “చైనా మరియు కొన్ని ఇతర దేశాలలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా మనం ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ ధరించడం, చేతి పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతో కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చునని అన్నారు.

గత సంవత్సరాల్లో దేశం కోవిడ్‌ను నియంత్రించిన విధానం, టీకా, సహజ రోగనిరోధక శక్తి కారణంగా, ప్రజలలో మెరుగైన రోగనిరోధక శక్తి కనిపిస్తోందని అంటున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా చివరి మూడు వేవ్ లలో దేశంలోని చాలా మందికి వ్యాధి సోకిన తర్వాత నయమైంది. ఇదే కాకుండా, టీకా, బూస్టర్ మోతాదులు కూడా దేశంలోని చాలా మందికి రక్షణ చర్యగా ఇచ్చారు. ఈ కారణంగా కరోనా కొత్త రూపాంతరాల వల్ల కలిగే సమస్యల నుండి అధిక రక్షణ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

స్వయంభు శంభు లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు

Satyam NEWS

డోంగ్లీ లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం    

Satyam NEWS

ఒక్క సారి ఈ వీడియో చూడండి…గుండె కదిలిపోతుంది..

Satyam NEWS

Leave a Comment