పట్టణ ప్రగతిలో భాగం గా వేములవాడ పట్టణ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని వేములవాడ పురపాలక సంఘం అధ్యక్షురాలు మాధవిరాజు మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను కోరారు.కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలని వివరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో భాగంగా అన్ని వార్డుల ను కొంతమేరకు పరిశుభ్రం చేశామని వివరించారు.
ప్రతి వార్డు లో తిరుగుతూ అవసరమున్న పనులను ఇప్పటికే అంచనా వేశామని వాటికి సంబంధించిన అభివృద్ధి నిధులను కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ నిధులను త్వరలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆలాగే తడి పొడి చెత్తను వేరు చేసేందుకు డ్రై రిసోర్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
పట్టణ ప్రగతిలో ప్రతి వార్డు శుభ్రపరిచి నటుడిగానే ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. కరోనా వ్యాధి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత కార్యక్రమాలు వేగవంతం చేయడమే కాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. జనసందోహాన్ని నివారించడమే కాకుండా వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు.