28.7 C
Hyderabad
April 26, 2024 08: 21 AM
Slider చిత్తూరు

తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో రిగ్గింగ్ కు రెక్కీ?

#SudhakarNB24

మంగళవారం  జరుగనున్న తొలి విడత  పంచాయతీ ఎన్నికలలో రిగ్గింగులు, దౌర్జన్యాలు చేసి గెలవాలని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారని టి డి పి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ప్రకారం మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు చెప్పినా  అయన తీరు మారలేదని సుధాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం పైగా పంచాయితీలలో టిడిపి మద్దతు దారులు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజన్స్ వర్గాలు తెలపడంతో పెద్దిరెడ్డి దొడ్డి మార్గాలు వెదుకుతున్నారని ఆయన అన్నారు.

చిత్తూరు జిల్లాలో వీలైనన్ని చోట్ల  ప్రత్యర్థులను బెదిరించి, మందు సరఫరా చేసి,రి గ్గింగులకు పాల్పడి తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకోవాలని అధికార పార్టీవారు  చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అధిక స్థానాలలో అల్లర్లు సృష్టించేందుకు ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి సిద్ధమౌతున్నారని ఆయన తెలిపారు.  

జి డి నెల్లూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున రిగ్గింగు చేయడానికి  ఏర్పాట్లు చేసుకుంటున్నారని, కార్వేటినగరం మండలంలోని పాదిరికుప్పం, ఆర్ కె వి బి పేట, ఎం ఎం విలాసం, అన్నూరు, కృష్ణాపురం పంచాయతీలో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు.

నారాయణస్వామి పి ఎ సుబ్రహ్మణ్యం ప్రతిపక్ష పార్టీల  మద్దతుదారులను బెదిరిస్తున్నారని, ప్రధానంగా దళిత వాడల్లో దౌర్జ్యన్యంగా ఓట్లు వేయుంచుకునేందుకు వ్యూహం రూపొందించుకున్నారని ఆయన తెలిపారు.

వెదురుకుప్పం మండలం గంటావారి పల్లె పంచాయతీలోని బొట్లవారి పల్లెలో ఓటేస్తే చంపేస్తామని గ్రామస్తులను  వైకాపా  నాయకులు బెదిరిస్తున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లాలో ఏకపక్షంగా గెలవాలని చూస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా  ఇదే ధోరణి కనిపిస్తోంది. దీనిపై ఎన్నికల కమీషనుకు ప్రతి చోట ప్రజలు  ఫిర్యాదులు చేస్తున్నారు. వైకాపా ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో  టిడిపి బలపరిచే అభ్యర్థులు మెజారిటీ స్థానాలలో గెలుస్తారు అని సుధాకర్ రెడ్డి తెలిపారు.

Related posts

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు

Bhavani

ఆదివాసీలకు ఉచిత వైద్యం అందించిన రెడ్ క్రాస్ సంస్థ

Satyam NEWS

మోదీ పర్యటనకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం

Bhavani

Leave a Comment