39.2 C
Hyderabad
April 28, 2024 14: 08 PM
Slider ప్రత్యేకం

ఎన్నికలు బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ

#Chandrababu Naidu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై తమ అభిప్రాయాలను నేతలు తెలియజేశారు.

ఎన్నికలను బహిష్కరించాలని మెజారిటీ నేతలు సూచించారు. దాంతో ఎన్నికలు బహిష్కరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం పడ్డారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సలహాదారుగా పని చేసిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

రబ్బర్ స్టాంపు ఎన్నికల కమిషనర్ నిర్వహించే ఎన్నికలలో తాము పాల్గొనలేమని ఆయన ప్రకటించారు.   

Related posts

ఖమ్మం లో రూ.36 కోట్లతో ఐటి హబ్ రెండో దశ

Satyam NEWS

భక్తులు లేక తిరుమల తిరుపతి వెలవెల

Satyam NEWS

లోకసభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు

Bhavani

Leave a Comment