33.7 C
Hyderabad
April 29, 2024 02: 58 AM
Slider శ్రీకాకుళం

పల్లె నిద్ర చేసిన విజయనగరం టీడీపీ నేత నాగార్జున…!

#nagarjuna

ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన  జగన్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని చీపురుపల్లి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ కిమిడి నాగార్జున ఆరోపించారు. నాగార్జున రాత్రి  కర్లాం గ్రామంలో పల్లె నిద్ర చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి రాగానే తమ దృష్టి కి వచ్చిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ  వైఎస్సార్సీపీ అధినేత జగన్  అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది అన్నారు. ఆర్.ఈ.సీ.ఎస్ ను ఏపీఈపీడీఎల్ లో విలీనం చేసి చీపురుపల్లి నియోజకవర్గం రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత మంత్రి బొత్స కే దక్కుతుంది అని అన్నారు. మంత్రి బొత్స చీపురుపల్లి  అభివృద్ధి ను గాలికి వదిలేసారు అని ధ్వజమెత్తారు.

జాబ్ క్యాలెండర్ అని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. కర్లాo గ్రామాన్ని అభివృద్ధి చేసి, జాతీయస్థాయిలో తీసుకెళ్లిన ఘనత తమకే దక్కుతుందన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకొని అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ను కల్పించామని నాగార్జున గుర్తు చేసారు. సంక్షేమ పధకాలు అందిస్తున్నామని చెప్పి, పేదోడు కొనుగోలు చేసే నిత్యావసర ధరల నియంత్రణను గాలికి వదిలేశారన్నారు.

మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రతి గ్రామన్ని బెల్టు షాప్ గా మార్చేసిన ఘనత వైఎస్సారెస్పీ కే చెల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రౌతు కాము నాయుడు, దన్నాన రామ చంద్రుడు, బాణాన రామకృష్ణ నాయుడు,దుగ్గు మల్లేశ్వర రావు, కెల్ల రామారావు, దుగ్గు రామకృష్ణ, బాణన రాము, మహంతి అప్పలనాయుడు, అరతి సాహు, సారిక మోహన్,శనపతి శ్రీనివాసరావు, పనస మణికంఠ,దన్నాన సూరప నాయుడు, మీసాల నవీన్,గొర్లె లక్ష్మణరావు,గడే సన్యాసప్పల నాయుడు,సబ్బి సోనియా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపజ్ఞ కు ఉపద

Satyam NEWS

గో గ్రీన్: నటులు, నిర్మాతల గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

హై కోర్టు స్టే ధిక్కరించి రాజంపేటలో పట్టాల పంపిణీ…..

Satyam NEWS

Leave a Comment