38.2 C
Hyderabad
April 29, 2024 19: 16 PM
Slider ముఖ్యంశాలు

తిరుపతి పార్లమెంటు ఎన్నికలపై టీడీపీ విసృతస్థాయి సమావేశం

#TDPMeeting

త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎన్నికలపై తిరుపతి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యులు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగాల్ రాయుడు ,రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు,మాజి మంత్రి అమర్నాథ్ రెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి పులివర్థి నాని,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి నరసింహ యాదవ్,మాజి మంత్రి పరసరత్నం, శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఇంచార్జి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి,రామానాయుడు,సతీష్ రెడ్డి ఇంకా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో బత్యాల  మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ ముందుచూపుతో,ఒక ప్రణాళికను తయారు చేసుకొని పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికలలో చాలా చోట్ల దౌర్జన్యంతో ఏకగ్రీవాలు,వారికి వ్యతిరేకంగా చేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు దారితీస్తున్న విషయం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే నని ఆయన అన్నారు.

రాష్ట్రంలో నిత్యం పెరుగుతున్న నిత్యావసరాలు, వంటగ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు, కరెంట్ బిల్లులు,ఇంటిపన్నులు ఇంకా చాలా వస్తువుల ధరలు పెరగటం సామాన్యుడుకి తలబారంగా మారిందని ఆయన అన్నారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని తెలుగుదేశం పార్టీ సత్తాని చాటి చూపించాలని, కార్యకర్తలు అందరూ పార్టీ గెలుపే ధ్యేయంగా కృషిచేయాలని అన్నారు.

Related posts

చీరాలలో వివాహితను నరికి చంపిన కిరాతకులు

Satyam NEWS

ఇలా చేస్తే కాండ్రించి ముఖాన  ఉమ్మేస్తారు

Satyam NEWS

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Satyam NEWS

Leave a Comment