38.2 C
Hyderabad
April 29, 2024 19: 43 PM
Slider ప్రత్యేకం

కేస్ క్లోజ్: జగన్ చాకచక్యంతో తెలుగుదేశం ఆటకట్టు

chandraba

అమరావతి కోసం జరుపుతున్న పోరాటంలో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రలో తిరగలేని పరిస్థితి తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరింత కష్టాలలో కూరుకుపోతున్నది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డిఏ రద్దు బిల్లు లను శాసన మండలిలో అడ్డుకున్నామని సంతోషపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు గుండెల్లో పిడుగు పడే విధంగా పరిణామాలు జరుగుతున్నాయి.

 తెలుగుదేశం పార్టీ కి కౌన్సిల్ లో మెజారిటీ ఉందనే సంతోషం ఆవిరి కాబోతున్నది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీని వీడి వైసిపితో చేతులు కలిపారు. తాజాగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బేరసారాలు ఒక కొలిక్కి వచ్చాయని తెలిసింది. దాంతో ఈ ఎనిమిది మంది కూడా వికేంద్రీకరణ, సీఆర్ డి ఏ రద్దు బిల్లులకు అనుకూలంగా ఓటు వేయబోతున్నారని సత్యం న్యూస్ కు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

11 మంది ఎమ్ ఎల్ సి లు బిల్లులకు అనుకూలంగా ఓటు వేస్తే ఇక తెలుగుదేశం పార్టీ ఆట కట్టు అయినట్లే అవుతుంది. మొత్తం 11 మంది ఎమ్మెల్సీలు తెలుగుదేశం వీడిపోతే అదే బాటలో మరో ఐదుగురు నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ప్రజా క్షేత్రంలో అమరావతి ఉద్యమంలో ప్రజల నుంచి భారీ ప్రతిస్పందన రాబట్టలేక పోతున్న తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కూడా చేతులు ఎత్తేసింది. కౌన్సిల్ లో ఆదిలో చూపిన ప్రతిఘటనను నీరుగార్చేందుకు అధికార పార్టీ అన్ని రకాల మార్గాలను ఓపెన్ చేయడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కౌన్సిల్ లో ఈ రెండు బిల్లులను ఆమోదింప చేసుకుంటే జగన్ మోహన్ రెడ్డికి ఇక తిరుగు ఉండదు. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

Related posts

18న వడ్డేమాన్ శనేశ్వర ఆలయంలో శని త్రయోదశి

Bhavani

హిరాసుక్క జయంతి విజయవంతం

Satyam NEWS

స్వయంభు శంభు లింగేశ్వర స్వామివారిని కిరణాలతో స్పృశించిన ఆదిత్యుడు

Satyam NEWS

Leave a Comment