37.2 C
Hyderabad
April 26, 2024 21: 29 PM
Slider జాతీయం

జీఎస్టీ ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం అభ్యంతరం

#Telangana CM KCR

తాజా జీఎస్టీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన తన లేఖలో సూచించారు.

కేంద్రం ప్రతిపాదనలు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ అన్నారు. జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని విమర్శించారు. రుణాలపై ఆంక్షలు సహేతుకం కావని అభిప్రాయపడ్డారు.

కరోనా ప్రభావంతో ఆదాయం ఘోరంగా పడిపోయిందని, జీఎస్టీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టేనని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందని తెలిపారు.

Related posts

ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులదే కీలకపాత్ర

Bhavani

దయా గుణం చూపిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment