28.7 C
Hyderabad
April 26, 2024 10: 50 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

HY13HIGHCOURT

కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉన్న సచివాలయాన్ని కూల్చి వేసి కొత్తది నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు అడ్డుపడింది. సచివాలయం కూల్చివేతపై 14వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కూల్చివేతపై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. అయితే కొత్త సచివాలయ భవన సముదాయ​నిర్మాణంపై మంత్రివర్గ ఉపవర్గం సమర్పించిన నివేదికను నేడు తెలంగాణ కేబినెట్‌ ఆమోదించనున్న వార్తల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువడటం గమనార్హం. కేబినెట్‌ భేటీ అనంతరం సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాలని భావించిన కేసీఆర్‌ సర్కార్‌కు కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది

Related posts

భోగి మంటలకే పనికి వచ్చే బోస్టన్ కమిటీ నివేదిక

Satyam NEWS

దింపుడు కళ్లెం ఆశలా రాయలసీమ డిక్లరేషన్

Bhavani

రెండు రోజుల సీఐడీ కష్టడీకి చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment