30.7 C
Hyderabad
April 29, 2024 04: 46 AM
Slider నిజామాబాద్

అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

#pocharam

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ, అన్నారం, రైతునగర్ గ్రామాలలో ఈరోజు పర్యటించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన గ్రామ సభలలో పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. వృద్ధులు, వికలాంగులతో పాటుగా వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు,  బోదకాలు బాధితులకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్ లు ఇస్తున్నారని, రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని అన్నారు.

ఆసరా పెన్షన్ల కోసం నెలకు రూ. 1,250 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 15,000 కోట్ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుందని స్పీకర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు కుల మతాలకు, పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ అందుతున్నాయని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్ అందరికీ అందుతున్నాయని ఆయన తెలిపారు.

బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణ కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేసామని, ఇప్పుడు చివరి డిస్ట్రిబ్యూటర్ వరకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. దామరంచ బ్రిడ్జి నుండి చింతల నాగారం చెక్ డ్యాం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ..60 లక్షలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ RDO రాజా గౌడ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

Satyam NEWS

రసాయనిక ఎరువులు తగ్గించాలి సేంద్రీయ ఎరువులు పెంచాలి

Bhavani

అమరావతి రైతుల కడుపు మంటకు కారణం జగన్

Satyam NEWS

Leave a Comment