38.2 C
Hyderabad
April 27, 2024 16: 10 PM
Slider రంగారెడ్డి

రైతును రాజును చేయ‌డ‌మే ల‌క్ష్యం

Vittal Naik-3

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు వారిని రాజుగా చేయడమే సిఎం కేసీఆర్ కల అని తాండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు.


శనివారం యాలాల మండల పరిధిలోని సంగాయిపల్లి తండాకు చెందిన రాస్నo ఎంపిటిసి సరితబాయి భర్త సుఖ్య నాయక్ ఆధ్వ‌ర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఛైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ.. 500 జనాభా కలిగిన గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా సీఎం కేసీఆర్ మార్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో తండాలను గ్రామాలుగా మార్చారని తెలిపారు.


మరొకవైపు రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, రైతు వేదికలు, రైతులు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు, గిట్టు బాటు ధర రైతును రాజు చేయడమే కేసీఆర్ ముఖ్యోద్దేశ్యమన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గురురాజ్ జోషి, ఉప సర్పంచ్ చందర్ నాయక్, డాక్య నాయక్, తార్య నాయక్, గోపాల్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దళిత బందుతో దళితులు వ్యాపారస్థులుగా ఎదిగేలా అవగాహన

Satyam NEWS

ఉత్తరాంధ్రలో కొన‌సాగుతున్నబంద్

Sub Editor

చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్ పంచిన V serve foundation

Satyam NEWS

Leave a Comment