28.7 C
Hyderabad
April 26, 2024 10: 46 AM
Slider పశ్చిమగోదావరి

పంచాయితీ సొమ్ము దొంగల పాలు

#Kuchimpudi road

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో ఓ పంచాయతీలో దొంగలు పడ్డారని తెలిసింది. దొంగలేవరో కాదు  సర్పంచ్ భర్త, ఆ పంచాయతీ కార్య దర్శితో కుమ్మక్కై పంచాయతీలో పనులు చేయకుండా చేసినట్టు చూపి సుమారు 10 లక్షల రూపాయల బిల్లులు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారం లో  అధికారులు కొంత మంది సర్పంచ్ భర్త  కార్యదర్శి దగ్గర ముడుపులు తీసుకుని దొంగ బిల్లులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు పెదవేగి మండలం లో చాలా మంది రాజకీయ నాయకుల లో రసవత్తరమైన చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.

ఈ దొంగ బిల్లుల పంచాయతీ రాజకీయ నాయకుల వద్దకు చేరినట్టు తెలిసింది. ఇదే పంచాయతీలో మహిళా సర్పంచ్ కి తెలియకుండా ఇదే పంచాయతీ కార్యదర్శి తన భార్య పేర 1లక్షా 60 వేల రూపాయలకు  దొంగ బిల్లులు సృష్టించి న ఘటన పై సర్పంచ్ భర్త అధికారులకు, రాజకీయ నాయకులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ పిర్యాదు పై అధికారులు ఆ కార్య దర్శి నిర్వాకం పై విచారణ కూడా జరిపినట్టు తెలిసింది.

ఇంతలో ఏమైందో కానీ దొంగకు దొంగ తోడైతే ఎదురేముందనుకున్నారో ఏమో కాని కార్యదర్శి పై 1లక్షా 60 వేల రూపాయల దొంగ బిల్లు ల పై అధికారులకు  ఇచ్చిన ఫిర్యాదుపై మౌనంగా ఉండాలంటే పంచాయతీలో చేయని పనులు చేసినట్టు చూపి 10 లక్షల రూపాయల బిల్లులు చేసి పంచుకుందామని ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి ఒక తప్పును కప్పి పుచ్చాడానికి మరో పెద్ద తప్పుకు తెరలేపారనే ఆరోపణలు గ్రామం లోను, మండలం లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు పంచాయతీ దొంగల వ్యవహారం పై జిల్లా అధికారులు, సంబంధిత పంచాయతీ జిల్లా అధికారులు ఏ విధం గా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం

Bhavani

డా.మోహన్ కు భారతదేశ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

Satyam NEWS

అకాల వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

Satyam NEWS

Leave a Comment