36.2 C
Hyderabad
April 27, 2024 22: 00 PM
Slider ఆధ్యాత్మికం

రేపు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

tiruchanur

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 1వ తేదీ ఆదివారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది. గజాలపై ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు ఉద‌యం 6 గంట‌ల‌కు తీసుకొస్తారు.

అక్కడినుంచి ఉదయం 7 గంట‌ల‌కు తిరుపతిలోని కోమలమ్మ సత్రం(ఆర్‌ఎస్‌గార్డెన్‌) చేరుకుంటారు. ఆ తరువాత తిరుపతి పురవీధుల గుండా ఉద‌యం 9 నుండి 10 గంట‌ల మ‌ధ్య తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుతుంది.

అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికారగణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుష్కరిణి వద్దకు సారె చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు పుష్కరిణిలోని పంచమితీర్థం మండపంలో స్నపనతిరుమంజనం మొదలవుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు కుంభ లగ్నంలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహిస్తారు.

Related posts

ఉపగ్రహ ఛాయా చిత్రాల పై అవగాహన పెంచుకోవాలి

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ లో మదర్సాల ఆదాయ వనరులపై సర్వే

Satyam NEWS

రైతు చట్టాలకు వ్యతిరేకంగా పాలమూరులో మాలల ధర్నా

Satyam NEWS

Leave a Comment