38.2 C
Hyderabad
April 29, 2024 11: 10 AM
Slider చిత్తూరు

ఘనంగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం

#bhumanakarunakarareddy

తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో తిరుపతి మరింత ఆధ్యాత్మిక  శోభ ను సంతరించుకుంది. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జఠిగిన తిరుపతి 892 వ జన్మదిన వేడుకలు ఆకట్టుకున్నాయి.

జియ్యర్ స్వాములు వెంట రాగా, వేద పండితుల మంత్రోఛ్చరణలు, భజన కీర్తనలు,  మంగళ వాయిద్యాల ఆద్యంతం భక్తి ప్రపత్తులను చాటుతూ ప్రదర్శన సాగింది. పౌరాణిక కళా బృందాల లయబద్ద విన్యాసాల నడుమ సాగిన కళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భూమన నిర్వహించిన ఆధ్యాత్మిక శోభా  యాత్రను.. దారి పొడవునా పచ్చ తోరణాలు కట్టి, కర్పూర హారతులు పడుతూ,  పూజలు నిర్వహిస్తూ భక్త జనులు స్వాగతించారు. 

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ప్రపంచ వ్యాప్త ప్రఖ్యాతులతో విరాజిల్లుతున్న నేటి తిరుపతిని 892 ఏళ్ల కిందట శ్రీ గోవిందరాజపురం గ్రామం పేరిట పునాది రాయి వేసి మరీ ఏర్పరిచిన శ్రీ రామానుజాచార్యలను స్మరించుకుని కార్యక్రమాన్ని భూమన చేపట్టారు. స్థానిక శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలోని శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించి ఆలయ వీధుల్లో శోభా యాత్రను   నిర్వహించారు

టీటీడీ కి అనుసంధానంగా….

ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి  మాట్లాడుతూ టీటీడీ కి అనుసంధానం చేస్తూ భవిష్యత్ లో ప్రపంచమంతటా తిరుపతి జన్మదిన వేడుకలను నిర్వహించేలా చర్యలు చేపడుతామని వెల్లడించారు. భగవద్ శ్రీ  రామానుజాచార్యులు వారి దివ్య హస్తలతో పునాది వేసి, 892 సంవత్సరాల కిందట శ్రీ గోవింద రాజపురంగా గ్రామం గా నేటి తిరుపతిని ఏర్పాటు చేశారన్నారు.

ప్రపంచంలో మరే ఇతర నగరాలకూ పుట్టిన తేదీ అంటూ లేదని, ఒక్క తిరుపతి కి మాత్రమే అంతటి ప్రాశస్త్యం ఉందన్నారు. 1130 సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీన  తన 112 వ ఏట శ్రీ రామానుజా చార్యులు శ్రీ గోవింద రాజుల స్వామి విగ్రహ ప్రతిష్ఠ తో పాటు ఆలయ వీధులకు శంకుస్థాపన చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయిని, శాసనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 

కాల గర్భంలో  తిరుపతి జన్మదినపు తేదీ ప్రాముఖ్యతకు నోచుకోలేక పోయినా,  ఇన్నేళ్ల తర్వాతైనా ఈ తరంలో తొలి సారి జన్మదిన వేడుకలు నిర్వహించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. భావితరాలు మున్ముందు ఈ వేడుకలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్, నగర కమిషనర్ పీఎస్ గిరీష, ఎస్పీ  వెంకట అప్పుల నాయుడు, నగర అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు.

Related posts

ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువల పూర్తిలో అలసత్వం వద్దు

Satyam NEWS

25 న విజయనగరం జెడ్‌పి ఛైర్మ‌న్ ఎన్నిక‌… ఏర్పాట్లు ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

Satyam NEWS

మంత్రి పువ్వాడకు బ్రాహ్మణ సంఘం మద్దతు

Bhavani

Leave a Comment