38.2 C
Hyderabad
April 28, 2024 21: 38 PM
Slider జాతీయం

కోటీశ్వరుడైన టమాటా రైతు

#tomato

మహారాష్ట్రలో ఒక రైతు టమోటాలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడయ్యాడు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం గయాకర్ అనే రైతు ఒక నెలలో 13,000 టొమాటో డబ్బాలను విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ సంపాదించారు.

తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అతను తన కొడుకు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలితో కలిసి ఎకరాల భూమిలో టమోటాలు పండించాడు. నాణ్యమైన టమోటాలు పండిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎరువులు, పురుగుమందులను ఎక్కువ వాడకుండా పంట తెగుళ్ళ నుండి సురక్షితంగా ఉండేలా చూసుకున్నారు. నారాయణగంజ్‌లో ఒక టమాటా క్రేట్‌ను అమ్మడం ద్వారా రైతు ఒక్కరోజులో రూ.2,100 సంపాదించాడు. గయాకర్ శుక్రవారం నాడు మొత్తం 900 క్రేట్లను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు.

Related posts

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అరెస్ట్

Satyam NEWS

పీడీఎస్ సరుకు అక్రమ సరఫరా ను అడ్డుకున్న విజయనగరం బీజేపీ

Satyam NEWS

రేవంత్ రెడ్డి విడుదలపై కొల్లాపూర్ లో సంబరాలు

Satyam NEWS

Leave a Comment