40.2 C
Hyderabad
April 26, 2024 12: 13 PM
Slider నల్గొండ

సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య

#Doddi Komraiaha

తొలి దశ తెలంగాణ ఉద్యమానికి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య బలిదానం సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిందని సీ.పీ.యం. జిల్లా నాయకులు జిట్ట నగేష్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రంలో  శనివారం నాడు ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిపిన కొమరయ్య వర్ధంతి సభ లో పాల్గొని మాట్లాడారు.

భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ  ఆనాడు భువనగిరి లో జరిపిన ఆంధ్ర మహాసభ నిజాం నవాబు, రజాకారు మూకలు ఊళ్లలో చేసే అరాచకాలను,అకృత్యాలను ఎదిరించే ఆందోళన పోరాటాలలో ప్రాణ త్యాగం చేసిన గొర్రెలకాపరి  అమరజీవి కొమరయ్య అని అన్నారు.

కొమరయ్య బలిదానం వల్ల లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు పోరాటాలకు ఆజ్యం పోసిందని చెప్పారు. వారి పోరాట స్ఫూర్తికి స్మారకంగా హైదరాబాద్ లో స్థలం కేటాయించి, ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్న ముఖ్యమంత్రి  కే.సీ.ఆర్ మాటలు నీటి మూటలుగానే ఉన్నాయని విమర్శించారు.  ముందుగా కొమరయ్య చిత్రపటానికి పూలమాల లు వేసి జోహార్లుఅర్పించారు .

ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నాయకులు పామనుగుల్ల అచ్చాలు,నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దలు, ఐతరాజు నర్సింహ, దేశగోని లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విలేజ్ డెవలప్ మెంట్: రాజుల గ్రామాన్ని సందర్శించిన ఎంపీవో

Satyam NEWS

విజన్ డాక్యుమెంట్: స్థానిక సంస్థలకు అధికారాలేవి?

Satyam NEWS

నెల్లూరులో కిడ్నాప్ సృష్టించిన కలకలం

Satyam NEWS

Leave a Comment