32.7 C
Hyderabad
April 27, 2024 02: 15 AM
Slider విజయనగరం

పోలీసు అమరవీరుల త్యాగాలు వృధా కారాదు

#police

వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవాల భాగంగా విజయనగరం జిల్లాలో పోలీసుశాఖలో పని చేసి, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా విధి నిర్వహణలో మావోయిస్టులతో పోరాడి మృతి చెందిన పోలీసు అమర వీరుల కుటుంబాల నివాస గృహాలను, వారు విద్యాభ్యాసం చేసిన పాఠశాలలను పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించారు.

జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో.. పోలీసు అమరవీరుడు ఎస్.సూర్యనారాయణ కుటుంబం నివాసం ఉంటున్న భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో వారి నివాసం ఉంటున్న ఇంటిని భోగాపురం సీఐ శ్రీధర్, ఎస్ఐ జయంతి మరియు నిబ్బంది సందర్శించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, సూర్యనారాయణ విద్యాభ్యాసం చేసిన పూసపాటిరేగలోని జెడ్. పి.పాఠశాలను సందర్శించి, విద్యార్ధులతో మమేకమయ్యారు.

పోలీసుశాఖకు సూర్యనారాయణ అందించిన సేవలను, సమాజ రక్షణకు, శాంతి నెలకొల్పేందుకు మావోయిస్టులతో జరిగిన పోరాటంలో మృతి చెందారని, అటువంటి పోలీసుల త్యాగాలు వృధా కారాదన్నారు. ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుండే బాధ్యతగల పౌరునిగా మసలుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, లక్ష్యాలు ఏర్పరుచుకొని, వాటిని సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చెయ్యాలని విద్యార్థుల్లో భోగాపురం సీఐ శ్రీధర్ స్ఫూర్తిని నింపారు.

విజయనగరం లో మహారాజా కళాశాలను ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి సందర్శించారు. పోలీసుశాఖలో విధులను నిర్వహిస్తూ మావోయిస్టుల దాడిలో మృతి చెందిన ముద్దాడ గాంధీ, బి. శ్రీరాములు, షేక్ ఇస్మాయిల్, ఎస్.సూర్యనారాయణ, సిహెచ్.చిరంజీవిలు పోలీసుశాఖ అందించిన సేవలను విద్యార్ధులకు వివరించారు.

శాంతి సమాజ స్థాపన కోసం అసువులు బాసిన పోలీసులు

మావోయిస్టు లతో వ్యక్తిగతంగా ఎటువంటి శతృ త్వం లేకపోయినా శాంతియుత సమాజ స్థాపన, ప్రజల రక్షణ కోసం, మావోయిస్టుల తో పోరాడి, జిల్లాకు చెందిన పోలీసులు మృతి చెంది, ప్రజల మనస్సులో చిరంజీవులయ్యారన్నారు. అటువంటి వ్యక్తుల త్యాగాలు వృధా పోకుండా మంచి లక్ష్యాలతో ఉన్నతంగా ఎదిగాలని, సమాజానికి, కన్నవారికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకోవాలని విద్యార్ధులను ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి ఉద్బోదించారు.

విజయనగరం కస్పా హైస్కూలును టూటౌన్ ఎసై బాలాజీరావు సందర్శించారు. కస్పా హైస్కూలు లో గతంలో చదువుకున్న షేక్ ఇస్మాయిల్ గురించి విద్యారులకు వివరించి, మావోయిస్టుల దాడిలో ఏవిధంగా ఆయన మృతి చెందినది వివరించారు.

శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసు అమరవీరుల త్యాగాలను తక్కువగా చూడవద్దని, వారు చేసిన ప్రాణ త్యాగం వలనే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. విద్యార్ధులందరూ అటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని విద్యార్ధులను ఎస్ఐ బాలాజీరావు ఆకాంక్షించారు.

జామి మండలం కొట్యాడ పాఠశాల లో గతంలో చదువుకున్న చిట్టిపంతుల చిరంజీవి రావు పాటశాల ను ఎస్ కోట ఎస్ఐ లోవరాజు సందర్శించారు. చిరంజీవ రావు గతంలోనే ఇదే పాటశాల చదివి, పోలీసు ఉద్యోగం సాధించారని, విధి నిర్వహణలో భాగంగా మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందారన్నారు. చిరంజీవి రావును స్ఫూర్తిగా తీసుకొని, విద్యార్థులు సమాజ సేవ చేసేందుకు పోలీసుశాఖ లో ఉద్యోగాలు సాధించాలని ఎస్ఐ లోవరాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు.

అదే విధంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలో పోలీసు అధికారులు ర్యాలీలను నిర్వహించి, విధి నిర్వహణలో పోలీసులు అందిస్తున్న సేవలు, త్యాగాల గురించి ప్రజలకు వివరించారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసుశాఖలో పని చేస్తూ, మృతి చెందిన పోలీసు అమరవీరులను సేవలను శ్లాఘిస్తూ, నినాదాలు చేసి, మానవహారం ఏర్పడి, వారికి నివాళులు అర్పించారు.

Related posts

విశాఖ పోర్టుకు తొలి సారి వచ్చిన భారీ రవాణా నౌక

Satyam NEWS

హైటెన్షన్ ప్రొటెస్ట్: అమరావతి కోసం మహాపాదయాత్ర

Satyam NEWS

ప్రజా చైతన్యమే లక్ష్యంగా ప్రజాపోరు యాత్ర

Bhavani

Leave a Comment