27.7 C
Hyderabad
April 26, 2024 06: 09 AM
Slider చిత్తూరు

తిరుపతి లో వీధి దీపాలు లేక ఇబ్బంది

#NaveenKumarReddy

తిరుపతి నగర నడిబొడ్డున ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న “రైల్వే అండర్ బ్రిడ్జ్” రాకపోకల మార్గాలలో “విద్యుత్ దీపాలు” లేక నడిచి డి అర్ మహల్ వైపు ఉన్న సత్రాలకు వెళ్లే యాత్రికులు, పరిసర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

రైల్వే అండర్ బ్రిడ్జి కింద వున్న చిన్నపాటీ ఫుట్ పాత్ పై చంకలో చంటి బిడ్డలతో చేతిలో లగేజితో టిటిడి రెండవ సత్రాలలో పార్కింగ్ చేస్తున్న టూరిస్ట్ బస్సుల వద్దకు వెళ్లే యాత్రికులతో పాటు డి అర్ మహల్ పరిసర ప్రాంతాలలో ఉన్న స్థానికులు దాసరి మఠం ఇందిరానగర్ కు నడిచి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

రైల్వే అండర్ బ్రిడ్జ్ లో లైట్లు లేకపోవడంతో పట్ట పగలు కూడా చిమ్మ చీకటిగా ఉండడంతో ఫుట్ పాత్ పై నడిచి వెళ్లే పాదచారులు ప్రమాదవశాత్తు కాలుజారి రోడ్డుపై వెళ్లే వాహనాల మీద పడి గాయాలపాలు కాకముందే నగరపాలక సంస్థ,టీటీడీ, రైల్వే అధికారుల సమన్వయంతో లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.

రైల్వే అండర్ బ్రిడ్జి నందు విద్యుత్ దీపాలు లేకపోవడంతో అటువైపు నడిచి వెళ్లే మహిళలు “చైన్ స్నాచింగ్” బారిన పడే అవకాశాలు ఉన్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద లైటింగ్ లేని కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణం నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు “చేతులు కాలాక ఆకులు పట్టుకున్న” చందంగా కాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

అంబర్ పేట్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అన్నదానం

Satyam NEWS

కొల్లాపూర్ కు రోడ్డు సౌకర్యం మెరుగుపరచాలి

Satyam NEWS

మహబూబ్ నగర్ లో టెలీమెడిసిన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment