32.7 C
Hyderabad
April 26, 2024 23: 15 PM
Slider హైదరాబాద్

ప్రభుత్వం ఇంత అన్యాయం గా వ్యవహరిస్తుందా?

#KartagaddaPrasuna

తెరాస శ్రేణులు ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇచ్చిన 10 వేల రూపాయల వరద సహాయం మింగేసిన వైనం. తెరాస ప్రభుత్వ వైఖరికి ఇదొక మచ్చు తునక అని తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

10వేల వరద సహాయం తమకు అందటం లేదని రోడ్డెక్కిన వెయ్యి మంది తార్నాక లోని  పర్తీవాడ వాసులు, సీతాఫలుమండి ఫ్లై ఓవర్ పై బైఠాయించిన బస్తి వాసులు, తమకు 10 వేల ఆర్థిక సహాయం అందే వరకు ఆందోళన చేస్తాం అంటున్నారని ఆమె అన్నారు.

చచ్చిన శవాలను  పీక్కు తినే   రాబందులు చూసాం గాని, ఇలా పేద వాళ్ళను వరద సాయం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా, వాళ్ళ వాళ్ళైతే ఇవ్వడం లేకపోతే కొంతమందికి 2 వేలు, కొంత మందికి 5 వేలు మిగిలిన వాళ్లకు అస్సలు ఇవ్వక పోవడం ఎక్కడ చూడలేదని ఆమె అన్నారు.

ఇదెక్కడి సమన్యాయం? ఇదేనా మనం కలలు కన్న బంగారు తెలంగాణ? అని కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు. వరద సహాయం లో చేతి వాటాల పైన చర్య తీసుకొని పేదలకు సత్వరమే న్యాయ జరిగేలా చూడాలని ఆమె కోరారు.

Related posts

ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలు అందజేసిన సైబరాబాద్ సీపీ

Sub Editor

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS

ఏప్రిల్ 1 నుంచి ఏపిలో నాణ్యమైన బియ్యం

Satyam NEWS

Leave a Comment