35.2 C
Hyderabad
May 1, 2024 00: 17 AM
Slider ప్రత్యేకం

శనిగకుంట అగ్నిప్రమాద బాధితులకు తుడుందెబ్బ సాయం

#tudumdebba

ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం కారణంగా నిరాశ్రయులైన వారికి ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ ఆధ్వర్యంలో తమకు తోచిన సాయం అందించారు. కొంతమంది దాతల సహకారంతో శనిగకుంట గ్రామంలోని 44 నిరాశ్రయ కుటుంబాలకు నిత్యవసర సరుకులు, చీరలు, బ్లాంకెట్లు, అందించారు.

శనిగకుంట ఆదివాసీ గూడెంలో గత నెల 28 న రాత్రి సమయంలో అగ్నిజ్వాలాలు ఎగిసిపడి 44 గుడిసెలు కాలిపోయాయి. ఎండకాలపు ఎరగడి, తాటి ఆకుల గుడిసెలతో, ఈత ఆకుల గుడిసెలతో నిర్మితమైఉన్న ఇళ్లపై గాలివేగంతో మంటలు ఊరంతా వ్యాపించి భారీగా నష్టం జరిగింది.

సర్వం కోల్పోయి నిరాశ్రయులైన శనిగకుంట అడవిబిడ్డలకు తుడుండెబ్బ చేయూతను అందించింది. తాము చేసింది సరిపోదని నిరాశ్రయులైన అడవిబిడ్డలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోని డబుల్  బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది.

వరి, కందులు, ఉలవలు, మినుములు పోడు వ్యవసాయంతో పండించిన పంటలను సంవత్సరం పొడవున తినటానికి గుమ్ములల్లో నిల్వచేస్తారు. మళ్ళీ వచ్చే ఏడాది పంట ఖర్చులకు దాచిపేట్టిన జొన్న వడ్లను షావుకారుల దగ్గర అమ్ముకొని వ్యవసాయం ఖర్చులు వెళ్లదీసుకుంటారు.

తినడానికి, వ్యవసాయ ఖర్చుల కోసం దాచుకున్న పంట గింజలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అందువల్ల ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బ్యాంకు రుణాలు మాఫి చేయాలని, ప్రతి కుటుంబానికి బ్యాంక్  నుండి రుణసౌకర్యం కల్పించాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది.

ఉచిత రేషన్ ద్వార సంవత్సరం పొడవునా బియ్యంతో పాటు 2000 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేందుర్ పుష్పరాణి, ATF జిల్లా అధ్యక్షులు పెందుర్ అర్జున్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సలాం వరుణ్, నాయకులు కుడుమేత  ప్రకాష్, పేందుర్ గోవింద్, మెస్రం దినేష్, మడావి మారుతి, కొవ రాము, అర్క గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కట్టడికి గిరిజన ప్రాంత ప్రజలు సహకరించాలి

Satyam NEWS

ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…

Satyam NEWS

విజయనగరం జిల్లాలో 50,148 మందికి విద్యాదీవెన‌…!

Bhavani

Leave a Comment