40.2 C
Hyderabad
April 28, 2024 17: 14 PM
Slider ప్రత్యేకం

ఇద్దరు నానీలకు మళ్లీ మంత్రి పదవి యోగం?

అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఇద్దరు నానీలకూ మళ్లీ మంత్రి పదవి యోగం పట్టబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇద్దరు నానీలూ మళ్లీ మంత్రులు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నాని, పేర్ని నానీలు మంత్రి పదవులు కోల్పోయారు. వారు మంత్రి పదవులు కోల్పోయిన నాటి నుంచి మంత్రి వర్గంలో ఒక రకమైన నిశ్శబ్దం నెలకొని ఉన్నదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడిని, ఆయన కుమారుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీనీ విమర్శించేందుకు ప్రస్తుత రాష్ట్ర మంత్రులు ఎవరూ అంతగా ప్రయత్నించడం లేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రి వర్గంలో లేకపోవడంతో కమ్మ వర్గానికి చెందిన చంద్రబాబునాయుడిని తిట్టేందుకు మనిషి లేకుండా పోయాడు. ఇది పెద్ద వెలితిగా మారింది.

కొడాలి నాని వ్యక్తిగతంగా తిట్టే తిట్లతో అప్పటిలో మంచి ‘‘స్పందన’’ వచ్చేదని, అది ఇప్పుడు కొరవడిందని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కొడాలి నాని విమర్శిస్తుంటే తెలుగుదేశం పార్టీ నిశ్శబ్దం పాటించేంది. అక్కడక్కడా ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి నానిని విమర్శించేందుకు ప్రయత్నించినా అందుకు పెద్దగా ప్రాముఖ్యత దొరికేది కాదు.

జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మళ్లీ…..

అలాంటిది మంత్రి పదవి పోయిన నాటి నుంచి కొడాలి నాని నిశ్శబ్దంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. చంద్రబాబునాయుడిని వ్యక్తిగతంగా తూలనాడుతూ కొడాలి నాని చేసే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఎంతో బాగా నచ్చేవి.

అయితే ఆయన నుంచి ఆ స్థాయిలో ఇప్పుడు విమర్శలు రాకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ శృతి మించి ఆరోపణలు చేస్తున్నదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి మరో బద్ధ శత్రువు అయిన పవన్ కల్యాణ్ ను తీవ్ర స్థాయిలో విమర్శించే పేర్ని నాని కూడా మంత్రి వర్గంలో లేకపోవడం మరో లోపంగా వైసీపీ భావిస్తున్నది.

మెగాస్టార్ చిరంజీవి ఇంటి విషయాలు పేర్ని నానికి పూస గుచ్చినట్లు తెలుస్తుంటాయి. చిరంజీవితో కూడా పేర్ని నానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ దశలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం వైసీపీకి ఈజీ అయ్యేది. పేర్ని నాని చేసే వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ను పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టేవి. మంత్రి పదవి పోయిన నాటి నుంచి పేర్ని నాని నుంచి ఆ స్థాయిలో విమర్శలు రావడం లేదు.

ఇది మరో లోపంగా జగన్ భావిస్తున్నారు. చంద్రబాబునాయుడిని, పవన్ కల్యాణ్ ను విమర్శించలేని మంత్రి వర్గం ఉన్నందుకు జగన్ చిరాకు పడుతున్నారని తెలిసింది. అందుకే ప్రస్తుత మంత్రి వర్గంలో ముగ్గురిని తొలగించి కొడాలి నాని, పేర్ని నానిలకు మళ్లీ స్థానం కల్పించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తీవ్రంగా విమర్శించే ఒక మహిళను కూడా వీరికి జత చేస్తే మరింత ఫలితం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది.

ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రుల్ని (అందులో ఒకరు మహిళ) తొలగించి కొడాలి నాని, పేర్ని నాని, మరో మహిళను మంత్రులుగా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దసరా తర్వాత దీపావళి పండుగకు ముందుగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండే అవకాశం కనిపిస్తున్నది.

Related posts

ఎస్ఐ దాష్టీకం.. మహిళపై దాడి..

Sub Editor

పండుగ వేళ గుండె పోటుతో జర్నలిస్టు సూరేపల్లె మృతి

Satyam NEWS

నాగ్ పూర్ లో 21వ తేదీ వరకూ సంపూర్ణ లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment