35.2 C
Hyderabad
April 27, 2024 11: 49 AM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి కి చేరిన నిరుద్యోగ భరోసా యాత్ర

#youth yatra

నిరుద్యోగ ఉద్యమ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిర్యుద్యోగ బరోసా యాత్ర ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుండి బీసీ సంఘం జాతీయఅధ్యక్షులు టైగర్ అర్. కృష్ణ  జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ యాత్ర కల్వకుర్తి కి చేరుకుంది ఈ యాత్రకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ నాయకులు స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి,అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఓ యు  విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్వకుర్తి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమ ను చూపిస్తున్నది ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలు గానే భావించాలని, ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిికేషన్లు వెయ్యాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కెసిఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని,  ప్రభుత్వం వెంటనే ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చెయలని అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని, బ్రతికుండి తెరాస ప్రభుత్వంతో పోరాటం చేసి ఉద్యోగాలు సాధించుకుందామని నిరుద్యోగులు ఎవరు అధర్య పడవద్దని కోరారు.ఢిల్లీ మేడలు వంచి తెలంగాణ సాధించిన మనం కెసిఆర్ మేడలు వంచి ఉద్యోగాలు సాధించుకోవడం పెద్ద కష్ట తరమైనది కాదన్నారు. ఇక నుండి కెసిఆర్ పై యుద్ధమే చేస్తాం అని ప్రకటించారు  .

ఈ కార్యక్రమంలో  నిరుద్యోగ జాక్ అధ్యక్షులు సందీప్ చమార్ ఉస్మానియా యూనవర్సిటీ జేఏసీ కన్వీనర్ గడ్డం వెంకటేష్ , కల్వకుర్తి జేఏసీ ఛైర్మన్ సదానందo గౌడ్, బీజేపీ పట్టణ అద్యకులు నర్సింహ, బిసి సబ్ ప్లాన్ అధ్యక్షులు రాజేందర్ ఉపాధ్యక్షులు గోపాల్ ,టీడీపీ నియోజకవర్గం ఇంచర్జ్ సురేందర్ గౌడు,బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షులు రాకేష్ వడ్డేపల్లి, తెలంగాణవిద్యార్థిసమితి అధ్యక్షుడు రమేష్ మరియు పవన్  సిద్దు , వెంకటేష్, లక్ష్మణ్, రము, కృష్ణ, సైదులు, రమేష్,తదితులు పాల్గొన్నారు.

Related posts

కొన్ని ప్రాంతాల నుంచి రష్యన్ సేనల ఉపసంహరణ

Bhavani

సీమ్లా ఒప్పందానికి విపక్షాలు సిద్ధం

Satyam NEWS

అవార్డులు రావటం పనితీరుకు నిదర్శనం

Murali Krishna

Leave a Comment