28.7 C
Hyderabad
April 27, 2024 03: 10 AM
Slider ఆదిలాబాద్

యూనిసెఫ్ ఏలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో అవగాహన

#UNICEF

కరోనా విపత్కర పరిస్థితిలో పిల్లల రక్షణ విద్య, వైద్యం పోషణ తదితర అంశాలపై యూనిసెఫ్ అలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ సెడ్స్ సంస్థ అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని బాల్ రక్ష భవన్ లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకట స్వామి, సభ్యులు డాక్టర్ డేవిడ్, దశరథ్, సమీర్ ఉల్లా ఖాన్, ఎస్ ఐ దేవరావు, డి సి పి ఓ రాజేంద్ర ప్రసాద్, అర్బన్ రిజిస్ట్రేషన్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ రవికాంత్, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి, సెడ్స్ మేనేజర్ రాజన్నఐదు గ్రామాల యువతీ యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో చైర్మన్ వెంకట స్వామి కరోనా థర్డ్ 3rd వేవ్ పై మాట్లాడుతూ యూనిసెఫ్ అలియాన్స్ ఫర్ చైల్డ్ రైట్స్  సంస్థల వారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా పై ఎంతో మందికి అవగాహన కల్పించడం అభినందనీయమని తెలిపారు.

ఎస్ఐ దేవరావు మాట్లాడుతూ పిల్లల రక్షణకు 1098, 100 సేవలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పిల్లల రక్షణ కేంద్రాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరారు.

Related posts

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Bhavani

మోడీ అమిత్ షాల సెంటిమెంట్లను ఊడ్చేసిన చీపురు

Satyam NEWS

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ సభ్యత్వ నమోదు ఇంఛార్జుల నియామకం

Satyam NEWS

Leave a Comment