26.7 C
Hyderabad
April 27, 2024 09: 48 AM
Slider కరీంనగర్

తెలిసి తెలియక మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

#MinisterHarishRao

కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. జగిత్యాలలో నేడు ఆయన మాట్లాడుతూ ఇంత కాలం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు అభివృద్ధి చేయలేదు. ఎందుకు మెడికల్ కాలేజీలు పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చాక 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జీఎస్టీ కింద తెలంగాణకు ఎనిమిదన్నర వేల కోట్లు ఇచ్చామంటున్నారు. కిషన్ రెడ్డి తెలిసి, తెలవక మట్లాడుతరు. అసలు జీఎస్టీ కింది మీరు ఇచ్చింది ఏం లేదు.

తెలంగాణ రాష్ట్రమే జీఎస్టీ సెస్సు కింద కేంద్రానికి ఇచ్చింది 30వేల కోట్లు ఇస్తే, కేంద్రం తెలంగాణకు ఇచ్చింది 8వేల కోట్లు. పన్నుల వాటా పెంచాము. 42శాతం రాష్ట్రానికి ఇస్తామనడం ఆశ్చర్యకరం. చాలా సార్లు కిషన్ రెడ్డి ఇలాగే మాట్లాడారు. వాస్తవాలు చెబితే నాలుక కరుచుకున్నారు. జూటా మాటలు చెబుతున్నారు. మీరు ఇచ్చింది తక్కువ కోతలు పెట్టింది ఎక్కువ. నిజంగా ఇచ్చింది 29.6 శాతం మాత్రమే. 42 శాతం ఇస్తున్నామనే పేరిట అనేక పథకాలు రద్దు చేశారు. మోడల్స్ స్కూల్స్ రద్ద, బీఆర్జీఎఫ్ రద్దు చేశారు. పథకాలను రద్దు చేశారు. దీని వల్ల కొన్ని వేల కోట్లు తెలంగాణకు నష్టం కలిగింది అని మంత్రి హరీష్ రావు అన్నారు.

రాష్ట్రాలకు వాటా తగ్గించారు. కేంద్రానికి వచ్చిన ఆదాయాన్ని మీరు పంచుతున్న వాటా 29.6శాతం మాత్రమే. మీరు చెప్పింది 42శాతం అనేది జూటా మాటా. కిషన్ రెడ్డి నేను చాలెంజ్ చేస్తున్నా ఎక్కడికి రమ్మంటే అక్కడికి చర్చకు వస్తా. రాష్ట్రాలకు డబ్బులు రాకుండా దొడ్డిదారిన డబ్బులు మళ్లిస్తున్నారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టేది ఎక్కువ. కేంద్రం ఖర్చు పెట్టేది తక్కువ. రాష్ట్రం కిందనే అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. మోడీ సీఎంగా పని చేశారు కాబట్టి ఆయనకు తెలుసు అందుకే రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం పెంచారు అంటున్నారు. మీరు పెంచలేదు కదా దించారు.

బండి సంజయ్ తలా తోక లేకుండా మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద నెలకు లక్ష కోట్ల అప్పు వేస్తున్నది. నెల తిరిగితే లక్ష కోట్ల అప్పు. ఈ 8 ఏళ్ల బీజేపీ పాలనలో కోటి కోట్ల అప్పు చేశారు. అప్పుల కుప్పగా దేశాన్ని మార్చింది మీరు. ప్రతి పౌరుడి మీద లక్షా 24వేల అప్పు చేసింది బీజేపీ ప్రభుత్వం అని మంత్రి అన్నారు. ఎల్ఐసీ తెగనమ్మిర్రు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిర్రు, బిఎస్ఎన్ఎల్ కూడబెట్టిర్రు, ఉన్న ఉద్యోగాలు పోగొట్టారు.

ఈరోజు తెలంగాణ ధాన్యాగారంగా మారింది. పంటలు అద్భుతంగా పండుతున్నాయి. ఇది అమాయకపు తెలంగాణ కాదు, ఉద్యమ తెలంగాణ. మీ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మరని హరీష్ రావు తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లను తీసుకు వచ్చి కిషన్ రెడ్డి మాట్లాడాలని హితవు పలుకుతున్నానని హరీష్ రావు అన్నారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన జిల్లా సహకార అధికారి

Satyam NEWS

ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష

Satyam NEWS

శ్రమ దోపిడీకి పరాకాష్ట -తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్య

Satyam NEWS

Leave a Comment