29.7 C
Hyderabad
April 29, 2024 07: 20 AM
Slider ముఖ్యంశాలు

ప్రత్యామ్నాయ విధానాల సాధనకోసం ఐక్య పోరాటాలు  

#airtwf

రవాణారంగం లేకుండా ఈ సమాజాన్ని ఊహించడమే సాధ్యం కాదని, ప్రజాజీవనంలో మమేకమై స్వయం ఉపాధితో రవణారంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ తమ సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిలభారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి రావినూతల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మంచి కంటి సమావేశ మందిరం (శ్యామల చక్రవర్తి ప్రాంగణం,సూదగాని లక్ష్మీనారాయణ నగర్)లో తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్ ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(ఎ.ఐ.ఆర్.టి.డబ్య్లూ.ఎఫ్ -సిఐటియు)తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలో ఆర్.లక్ష్మయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభోపన్యాసం చేస్తూ కోవిడ్ మహమ్మారి కాలంలో లాక్ డౌన్ పేరుతో అందరూ ఇండ్లకే పరిమిత మైతే ఒక్క రవాణా రంగ కార్మికులు మాత్రమే ప్రాణాలకు తెగించి నిత్యావసర సరుకులు, మందులు అందించడానికి రోడ్డు మీదకు వచ్చి పనిచేశారని అభినందించారు.

ఒక్కరోజు రవాణా రంగం స్తంభించి పోతే జరిగిన నష్టమేమిటో పాలక ప్రభుత్వాలు గమనించాలన్నారు.ప్రజలకు కనీస అవసరాలు,భద్రత అందిస్తూ సేవా రంగంలో పనిచేస్తున్న రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిందని ఆరోపించారు. స్వయం ఉపాధితో రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పోటీగా కార్పొరేటు సంస్థలైన ఊబర్, ఓలా  లాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి లీటర్ డీజిల్ మరియు పెట్రోల్ పై ఎనిమిది శాతం ఇన్ఫా  స్ట్రక్చర్ పన్ను వసూలు చేస్తూ, మరలా టోల్ గేట్ చార్జీలు వసూలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. వీటి గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర  సమాధానమే లేదని తెలిపారు.

2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల అజెండాలో రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికై తమ మేనిఫెస్టోలో పెట్టే విధంగా రవాణా రంగ కార్మికుల పోరాటాలు ఉండాలన్నారు. రవాణా రంగ కార్మికుల్లో చైతన్యం కలిగించి మనోధైర్యం కలిగించే విధంగా పోరాటాలు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.వీరయ్య, కళ్యాణం వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ రాష్ట్ర  కార్యదర్శి పి. శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు వై.విక్రమ్, టి విష్ణు, జె.ఉపేందర్, కల్లూరి మల్లేశం, రవీందర్ రెడ్డి, పాషా, రామచందర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెట్‌అకాడ్ రైడర్స్‌ ఇండియా ఛాంపియన్‌గా భాషిత 

Satyam NEWS

యుద్ధ నౌకలో పేలుడు: ముగ్గురు నావికుల మృతి

Satyam NEWS

బెగ్గర్ బట్:జస్ట్ చేంజ్ ఇదో బిచ్చగాడి సినిమా కథే

Satyam NEWS

Leave a Comment