33.7 C
Hyderabad
April 29, 2024 00: 44 AM
Slider ప్రపంచం

కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తన అధికారాలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించనున్నారు. కమల హారిస్ ఈ అధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది తాత్కాలికమే. సమాచారం ప్రకారం జో బిడెన్ కొలనోస్కోపీ కోసం అనస్థీషియా తీసుకోనున్నారు. దీంతో తన అధికారాన్ని కొంత కాలం కమలా హ్యారిస్‌కు అప్పగిస్తున్నారు.

పెద్ద పేగుకు సంబంధించి బైడెన్​కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు. అయితే బైడెన్​అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. అందువల్ల ఆ సమయంలో కమలా హారిస్​కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్టు శ్వేతసౌధం వెల్లడించింది.

దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించనున్నారు. ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.

Related posts

కమలం గూటికి చేరబోతున్న గులాంనబీ ఆజాద్?

Satyam NEWS

Rajasingh Vs Razaq: ఆంధ్రా బిజెపి సైలెంట్: ఎందుకో…..?

Satyam NEWS

శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

Bhavani

Leave a Comment