26.7 C
Hyderabad
April 27, 2024 09: 30 AM
Slider జాతీయం

కమలం గూటికి చేరబోతున్న గులాంనబీ ఆజాద్?

#GulamnabeeAzad

71 సంవత్సరాల గులాంనబీ ఆజాద్ పార్టీ మారబోతున్నారా?

జీవిత కాలం మొత్తం కాంగ్రెస్ లో గడిపిన గులాంనబీ ఆజాద్ ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్ది కాలం కిందటే గులాంనబీ ఆజాద్ బిజెపితో టచ్ లోకి వెళ్లిపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

అప్పటి ఆయన ఆరోపణలు రుజువు చేస్తున్నట్లుగా రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ ను ప్రధాని నరేంద్ర మోడీ పొగడ్తలతో ముంచెత్తారు.

అంతే కాదు ఈ తరం నాయకులు గులాంనబీ ఆజాద్ ను చూసి నేర్చుకోవాలని కూడా చెప్పారు. తనకు గులాం నబీ ఆజాద్ కు మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లు కూడా మోడీ చెప్పారు.

గులాంనబీ ఆజాద్ ను బిజెపిలో చేర్చుకుని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా పంపుతారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

లేదా గులాం నబీ ఆజాద్ ను తదుపరి ఉప రాష్ట్రపతిని చేస్తారని కూడా అంటున్నారు.

బిజెపిలో పదవులు పొందేందుకు అనధికారికంగా 75 సంవత్సరాల రిటైర్ మెంట్ వయసును అమలు చేస్తున్నారు.

అందువల్ల గులాంనబీ ఆజాద్ మరో నాలుగేళ్ల పాటు బిజెపి కి సేవ చేసే అవకాశం ఉంది.  

Related posts

దళితులపై దాడులు జరిగినా పట్టించుకోని అధికారులు

Satyam NEWS

అమరావతి రైతుల కడుపు మంటకు కారణం జగన్

Satyam NEWS

జాతీయ రహదారి పక్కన మద్యం నిల్వ చేసిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment