28.7 C
Hyderabad
April 26, 2024 07: 52 AM
Slider నిజామాబాద్

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు

#Fertilizer Shops

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎరువులు పురుగుల మందులు విత్తనాలు అమ్మే దుకాణాల తనిఖీని మండల  అధికారులు సంయుక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలేని విత్తనాలు గానీ ఎరువులుగానీ అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి పోచయ్య హెచ్చరించారు.

స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు పుస్తకంలో రాసి పెట్టాలన్నారు. కృతిమ కొరత సృష్టించి అధిక ధరల కమ్మితే దుకాణం లైసెన్స్ సీజ్ చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. కొనుగోలు చేసిన ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారితోపాటు తహశీల్దార్ వెంకటరావు,ఎస్సై కృష్ణ , అయా దుకాణ యజమానులు ఉన్నారు.

Related posts

ఎష్యూరెన్స్: ఆఖరి గింజ వరకు కొనుగోళ్లు చేస్తాం

Satyam NEWS

దిశ చట్టం ప్రత్యేక అధికారిగా కృతిక శుక్లా

Satyam NEWS

జర్నలిస్టులపట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?

Satyam NEWS

Leave a Comment