31.2 C
Hyderabad
January 21, 2025 15: 22 PM
Slider సినిమా

విద్యాబాలన్ ఇక శకుంతలాదేవి

vidyabalan

తెలుగు, హిందీ భాషల్లో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇదే కోవలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. మ్యాథమెటికల్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న శకుంతలాదేవిపై ఈ బయోపిక్ ప్రారంభమైంది. లండన్ లో ప్రారంభమైన ఈ బయోపిక్ లో విద్యాబాలన్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. అను మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ శకుంతల దేవి బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ “ఈ కొద్ది నెలల గ్యాప్ లో నా గురించి నేను తెలుసుకున్నా. మ్యాథ్స్ లో ఇంత గొప్ప మేధావి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. హ్యూమన్ కంప్యూటర్ అన్న పేరు శకుంతలకు ఎలా వచ్చిందో తెలుసుకున్నా. ఆ తర్వాత ఆ పాత్రపై మక్కువ పెరిగింది. ఈ కథను ఇష్టపడడానికి కారణం పాత్ర స్వభావం. అయస్కాంతం లాంటి ఆకర్షణ కలిగి ఉన్న పాత్ర ఇది. తన జీవితం ఎంత ప్రభావవంతమైంది అన్నది” తనని ఎంతగానో ఆకర్షించిందని చాలా ఎమోషనల్ అయ్యారు.

Related posts

ఏజన్సీ లో మెగా వైద్య శిబిరం

Murali Krishna

చేయాత పేరుతో 4000పెన్షన్

mamatha

మేయర్ మా లక్ష్మీ మా ఇంటికి వస్తావా?

Satyam NEWS

Leave a Comment