32.7 C
Hyderabad
April 27, 2024 00: 34 AM
Slider విజయనగరం

స్పందన ద్వారా బాధితుల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరణ

#vijayanagarampolice

ప్రతీ వారం మాదిరిగా నే విజయనగరం జిల్లా  ఎస్పీ దీపికా ఎం పాటిల్…తన పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకూ న్యాయం చేయాలని ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 40 ఫిర్యాదులను స్వీకరించి, బాధితులకు రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరం మండలం, బడుకొండుపేట కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తనకు చెందిన భూమిలో పంచాయితీ కుళాయి వేయిస్తుండగా చెల్లూరి గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు తనతో గొడవ పడి, దాడి చేసి, గాయపరిచారని, వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐ ని ఆదేశించారు.

విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ బొబ్బిలి మండలం కలవరాయి గ్రామంలోగల ఇంటి ఖాళీ స్థలాన్ని విజయనగరాని కి చెందిన వేరొక వ్యక్తి నకిలీ ధృవ పత్రాలతో రిజిస్ట్రే షన్ చేయించి, తనను మోసం చేశారని, ఈ విషయమై వారిని ప్రశ్నించగా, దౌర్జన్యానికి దిగుతున్నాడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టాలని, ఇరువురి డాక్యుమెంట్లను పరిశీలించి, ఫిర్యాదికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని బొబ్బిలి డీఎస్పీను ఆదేశించారు.

గుర్ల మండలం చింతపల్లి పేట గ్రామానికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ గరివిడి మండలం కొండపాలెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇంటి డాక్యుమెంట్లు కుదవ పెట్టుకొని  4లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, ఇంత వరకు సదరు వ్యక్తులు తనకు వడ్డీ కాని, అసలు కూడా చెల్లించడం లేదని, ఇదే విషయమై వేరొక వ్యక్తి పెద్ద మనిషిగా వ్యవహరించి, అప్పు ఇప్పిస్తామని, డాక్యుమెంట్లును తీసుకొని, తనను మోసం చేసారని, వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి చట్ట పరిధిలో న్యాయం చేయాలని గరివిడి ఎస్ ఐను ఆదేశించారు.

విజయనగరం కాళీఘాట్ కాలనీకి చెందిన కొంత మంది మహిళలు జిల్లా ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ, ఆర్టీసి కాలనీలో ఉంటున్న మహిళ వడ్డీలకు కోటిన్నర అప్పుగా అందరి నుండి తీసుకొని, గత రెండు నెలలుగా పరారీ అయ్యారని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ వన్ టౌన్ సీఐను విచారణ చేపట్టి, చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఆదేశించారు.

పాచి పెంట మండలానికి చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీగార్కి ఫిర్యాదు చేస్తూ తన భర్త చనిపోయాడని, వ్యవసాయ పనులు చేసుకొనే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆమెను వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఫిర్యాదికి న్యాయం చేయాల్సిందిగా పాచి పెంట ఎస్ ఐ ని ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, డీసీఆర్ బి సీఐ బి.వెంకట రావు, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, డీసీఆర్ బి ఎస్ఐలు నీలకంఠం, సూర్యారావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అనారోగ్యంతో వచ్చి ఆర్టీసీ బస్సులోనే ఆగిన శ్వాస

Satyam NEWS

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Satyam NEWS

కేసీఆర్‌, కేటిఆర్ తో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భేటీ

Satyam NEWS

Leave a Comment