37.2 C
Hyderabad
April 26, 2024 20: 24 PM
Slider విజయనగరం

108 కు దారివ్వని నగరం.. ట్రాఫిక్ సిబ్బంది తో ఎస్పీ అత్యవసర సమావేశం…!

#SPMeeting

విజయనగరం జిల్లాలో ఒకే ఒక్క రోజు.. తాము కచ్చితంగా పని చేస్తే ఎలా ఉంటుందో చూపించారు.. జిల్లా పోలీసులు. అదీ జిల్లా ఎస్పీ ఆదేశాలతో.. ఎక్కడిక్కడే సీఐ ,ఎస్ఐ ర్యాంక్ అధికారులతో బందోబస్తు నిర్వహించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డు కట్టవేసారు.

ఈ పరిణామం తో పోలీసులంటే ఏమిటో వారి పనితీరు ఎలా ఉంటుందో స్వయంగా చూసారు…ప్రజలు. అందున..జిల్లా కేంద్రంలో విజయనగర ప్రజలు. అందుకు నిదర్శనమే..నగరంలో ని లోవర్ ట్యాంక్ బండ్ వద్ద…108 అంబులెన్స్ ఇరుక్కు పోవడం. ఇక ఆ ఆంబులెన్స్ ఎందుకు అక్కడ ఉండిపోయిందో..ఎటు వెళుతుందో..అసలు అందులో ఎవ్వరు ఉన్నారో…ప్రమాదం ఎలా జరిగింది.. క్షతగాత్రులు ఎవ్వరు అన్న అంశాలను తెలుసుకోకుండా…నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టసాగారు.

పర్యవసనంగా జిల్లా పోలీసు శాఖ ఓ రకంగా సోషల్ మీడియా నెటిజన్లు పరువు తీసే స్థాయిలో పోస్టులు పెట్టడంతో.. స్వయంగా ఎస్పీ రాజకుమారి రంగంలో కి దిగారు. ఈ మేరకు ట్రాఫిక్ డీఎస్పీ,నగర డీఎస్పీ,ట్రాఫిక్ ఎస్ఐ జియాయుద్దీన్ ,సీఐలు మురళీ ,శ్రీనివాసరావు లతో తన చాంబర్ లో రాత్రి అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.నగరంలో ఉదయం జరిగిన ట్రాఫిక్ చిక్కులు ,108 వాహనం నిలచిపోవడం ,సిబ్బంది పనితీరు పై సుదీర్ఘంగా చర్చించారు… ఎస్పీ.

ఒక్కరోజు అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు.. అన్ని జంక్షన్ లలో బందోబస్తు నిర్వహించి,..అనవసరంగా రోడ్ల విచ్చలవిడిగా తిరుగుతున్న వాహనదారులను  ప్రశ్నించారు… పోలీసులు. ఈ నేపథ్యంలో 108 వాహనం అడ్డంగా ట్యాంక్ బండ్ రోడ్ లో ఇరుక్కు పోయింది. అందుకు గల కారణాన్ని ఎస్పీ..శాఖా సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు.

ఆ సమయంలో ఆ ప్రదేశంలో చిక్కుకున్న బాధితులను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా 108 వాహనం వెళుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు.. ట్రాఫిక్ ను క్లియర్ చేసామని ఎస్పీకి చెప్పినట్టు సమాచారం.ఇక నగరంలో ఒక్క రోజు పటిష్టంగా, కఠినతరంగా పోలీసులు వ్యవహరించిన తీరు..పర్యవసనం గా వచ్చిన విమర్శలపై కూడా సిబ్బందిని ఆడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

అలాగే జిల్లాలో కర్ఫ్యూ సడలింపు,  అమలు సమయంలో మరింతగా వ్యవహరించాల్సిన విధి, విధానాలపై కూడా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ  రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు కర్ఫ్యూ నిబంధనల సడలింపు, అమలు సమయం లో పోలీసులు వ్యవహరించాల్సిన విధి, విధానాల పై పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ లో అంబులెన్సులకు ఎటువంటి అంతరాయం లేకుండా త్వరగా హాస్పిటల్స్ కు చేరుకోవడానికి గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రజల సంక్షేమం కోసం, కరోనా వైరస్ నియంత్రణ కోసం కరోనా నిబంధనలు పాటించాలన్న విషయం ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా మద్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ నిబంధనలు ఇకపై ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రస్తుత పరిస్థితిని ప్రజలు అర్ధం చేసుకొని పోలీసులకు సహకరించాలన్నారు. మద్యాహ్నం 12 గంటలకే ప్రజలు తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకొనే విధంగా చూసుకోవలన్నారు.

కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లపై తిరగవద్దన్నారు. భోజనాలు పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు తప్పనిసరిగా సంబంధిత డీఎస్పీ వద్ద నుండి అనుమతి పొందాలన్నారు. ఆసుపత్రులకు వెళ్ళి వచ్చే వారు సంబంధిత ఆసుపత్రి నుండి ఔట్ పాస్ ను చూపాలన్నారు. మందులు తెచ్చుకొనే అవకాశం లేని వారికి పోలీసు మహిళా సంరక్షణ పోలీసుల సహకారంతో వారికి మందులు పంపే ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ సమావేశంలో విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, విజయనగరం 1వ పట్టణ సీఐ జె. మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్.శ్రీనివాసరావు, రూరల్ సీఐ మంగవేణి, ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఎస్ఐ లు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

Satyam NEWS

అలనాటి కవులకు, నేటి కవులకు వేదిక ఆటా

Satyam NEWS

గర్భిణుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

Satyam NEWS

Leave a Comment