38.2 C
Hyderabad
April 29, 2024 13: 38 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర కార్యాలయంగా విశాఖ పార్టీ కార్యాలయం

#ysrcp

పరిపాలనా రాజధాని కానున్న విశాఖపట్నంలో నిర్మాణం చేయనున్న జిల్లా పార్టీ కార్యాలయం భవిష్యత్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుందని టిటిడి చైర్మన్, వైయస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఎండాడలోని పనోరమా హిల్స్ దగ్గర 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 45 నుంచి 60 రోజుల్లో పార్టీ కార్యాలయం మొదటి దశ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యాలయాల్లో 24X7 కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయిన తక్షణమే పాలనా రాజధాని పనులు మొదలు కానున్నట్టు వెల్లడించారు. జనవరిలో భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. అదాని డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే విశాఖలోని 40 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక  ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో నవ్వులు పంచుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజానీకమంతా అండగా ఉండి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఎమ్మేల్యే అవంతి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు

Related posts

కోర్టు ఆదేశాలను మళ్లీ తప్పు పట్టిన సిఎం జగన్

Satyam NEWS

అందరూ పొగుడుతుంటే ఈ ఏడుపెందుకు?

Bhavani

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రులు

Satyam NEWS

Leave a Comment