26.7 C
Hyderabad
April 27, 2024 09: 54 AM
Slider నిజామాబాద్

పేస్కేల్ అమలు కోరుతూ తాసిల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన

#kamareddy

ముఖ్యమంత్రి కె సి ఆర్ తమకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి పే స్కేల్ అమలు చెయ్యాలని కోరుతూ  గ్రామ రెవిన్యూ సహాయక సంఘ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయల ఎదుట వి ఆర్ ఏ లు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్ద కొడప్ గల్, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో గ్రామ రెవిన్యూ సహాయక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ వెంటనే పే స్కేల్ అమలు చేస్తూ తమ వి ఆర్ ఏ లను ఆదుకోవాలని నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ   కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ వి ఆర్ ఏ సల్ల రమేష్ ఆత్మహత్య కు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, ఈ ఆత్మహత్య  కాకుండా ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తూ సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 60సంవత్సరాలు పై బడిన వి ఆర్ ఏ వారసులకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బిచ్కుంద తాహసిల్దార్ ఆనంద్ కుమార్   కు అందజేశారు. ఈ కార్యక్రమం లో బిచ్కుంద మండల గ్రామ రెవిన్యూ సహాయకుల కేంద్ర సంఘం మండల అధ్యక్షుడు టి. రాజు. ఉపాధ్యక్షుడు పుట్టవర్ అనిల్. కార్యదర్శి జె. సంతోష్, కోశాధికారి కపిల్ కుమార్, గైని రవి,మంజుల, పద్మ, కావేరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

జీ లాలయ్య, సత్యం  న్యూస్, జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్

Related posts

పొత్తుల ప్రకటనతో ప్యాంటులు తడుపుకుంటున్న వైసీపీ నేతలు

Bhavani

పెట్రోల్, డీజిల్‌ అసలు ధర ఎంత?.. వాత ఎంత?

Sub Editor

రిటర్నింగ్ అధికారిగా మైనారిటీ తీరని బాలుడు

Satyam NEWS

Leave a Comment