38.2 C
Hyderabad
April 28, 2024 21: 33 PM
Slider మహబూబ్ నగర్

మాదక ద్రవ్యాలపై మరిన్ని కఠిన చర్యలు

#wanaparthypolice

గంజాయి,గుట్కా,మట్కా లాంటి నిషేధిత వస్తువుల రవాణాపై చర్యలు తీసుకోవాలని, నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీసు అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని వనపర్తి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ  జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశించారు. 

ముందుగా జిల్లాలోని ఆయా పోలీస్టేషన్ల పోలీసు అధికారులును పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను  క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు పెండింగులో ఉన్న త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ ఎస్పీ  మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 

శాస్త్రసాంకేతిక ఆధారాలతో పకడ్బందీగా నేరాల్లో దర్యాప్తు చేసినప్పుడు అలాంటి దర్యాప్తును న్యాయస్థానాలు నమ్ముతాయని, నిందితులు చట్టం నుండి తప్పించుకోకుండా కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. అలాంటప్పుడు నేరస్తుల్లో భయం పుడుతుందని,నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం నేరస్తులకు ఏర్పడుతుందని తెలిపారు.

జిల్లాలో అన్ని పోలీస్టేషన్ల పరిధిలో  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి,గుట్కా,మట్కా లాంటి నిషేధిత వస్తువుల రవాణాకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు.

దొంగతనం కేసులలో నేరస్తులను పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారినపడకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అదేవిధంగా శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూడా ప్రజలలో పోలీసుశాఖపై మరింత నమ్మకం పెరిగేలా బాధ్యతగా విధులను నిర్వర్తించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. 

వర్టికల్స్ విధానంతో పోలీసులకు ఆయా విభాగాల్లో అప్పగించిన బాధ్యతను కచ్చితంగా అమలు చేయడానికి కృషి చేయాలని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలలో  విలేజ్ పోలీస్ ఆఫీసర్లు పర్యటించి ప్రజలకు సీసీ కెమెరాల గురించి అవగాహన, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, బాల్య వివాహాలు, బాల కార్మిక  వ్యవస్థ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ  సూచించారు.

ఈ నేర సమీక్ష  సమావేశంలో వనపర్తి డీఎస్పీ, ఆనంద్ రెడ్డి, వనపర్తి సీఐ, ప్రవీణ్ కుమార్, ఆత్మకూరు సిఐ రత్నం, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై రామన్ గౌడ్, వనపర్తి పట్టణ ఎస్సై,యుగంధర్ రెడ్డి, వనపర్తి రూరల్ ఎస్సై,చంద్రమోహన్,  జిల్లాలోని ఎస్సైలు,డీసీఆర్బీ, సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్

Related posts

రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్

Satyam NEWS

వైభవంగా సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

Satyam NEWS

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన బండి

Satyam NEWS

Leave a Comment